Tuesday, November 26, 2024

Karnataka : ప్రీమియర్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులను ఆహ్వానిస్తున్న‌ కొమెడ్ కె

హైదరాబాద్ : గత ఐదు దశాబ్దాలుగా ఉన్నత విద్యలో అగ్రగామిగా కర్ణాటక నిలుస్తోంది. విభిన్న కళాశాలల శ్రేణి, అత్యుత్తమ రీతిలో విద్యాపరమైన అవకాశాలు, గ్రాడ్యుయేషన్‌ అనంతరం అధిక ఉద్యోగ నియామకాలు విశేషమైన ట్రాక్ రికార్డ్‌ను పరిగణనలోకి తీసుకుని, ఇంజనీరింగ్‌లో కెరీర్ ను నిర్మించుకోవాలనుకునే వ్యక్తులకు ఇది ప్రాధాన్యత గమ్యస్థానంగా నిలిచింది. ఉన్నత విద్య పట్ల రాష్ట్రం నిబద్ధత, గణనీయమైన నైపుణ్యం కలిగిన నిపుణుల సమూహాన్ని పెంపొందించింది, గణనీయమైన రీతిలో ప్రపంచ డిమాండ్‌ను ఆకర్షించింది. ఈ ఆన్‌లైన్ పరీక్ష భారతదేశంలోని 200కు పైగా నగరాల్లో, 400కు పైగా పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. ఈ ఏడాది 1,00,000మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని అంచనా వేస్తోంది. భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందిన విద్యార్థులైనా ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈసంద‌ర్భంగా కొమెడ్ కె ఎగ్జిక్యూటివ్ సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ కుమార్ మాట్లాడుతూ… కొమెడ్ కె విద్యార్థి మెరిట్, ఆప్టిట్యూడ్ వారి విద్యా ప్రయాణానికి ఏకైక మార్గదర్శక కారకాలుగా ఉండాలని తాము విశ్వసిస్తున్నామన్నారు. త‌మ ప్రవేశ పరీక్ష, కొమెడ్ కె యూజెట్, పరీక్ష ప్రక్రియలో సరళత, నిష్పాక్షికత పట్ల త‌మ నిబద్ధతకు నిదర్శనమ‌న్నారు. 150 కంటే ఎక్కువ అగ్రశ్రేణి కళాశాలలు యూజెట్ ద్వారా విద్యార్థులను చేర్చుకుంటాయన్నారు. ఎరా ఫౌండేషన్‌ సీఈఓ పి.మురళీధర్ మాట్లాడుతూ… తమ తదుపరి విద్య ఎక్కడ కొనసాగించాలో ఎంచుకోవడానికి ఏకైక ప్రమాణంగా విద్యార్థి మెరిట్, ఆప్టిట్యూడ్ ఉండాలని తాము గట్టిగా విశ్వసిస్తామన్నారు. యూని-గేజ్ అనేది పరీక్షా వేదికగా సరళత, నిష్పాక్షికత అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా సూక్ష్మంగా రూపొందించబడిందన్నారు. రేపటి తరపు ఉద్యోగుల సమగ్ర అభివృద్ధికి త‌మ సహకారం పట్ల తాము గర్విస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement