కర్మన్ ఘాట్ జూలై 22 (ప్రభ న్యూస్) కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో సీసీ కెమెరాలు చూసేందుకు 80 వేల విలువ గల రెండు ఎల్ఈడి టీవీలను దేవాలయం మాజీ ధర్మకర్త బసి గూడెం జంగారెడ్డి దంపతులు అందజేశారు. శనివారం హనుమాన్ దేవాలయం ఈవో తో పాటు సిబ్బంది ఉండే కార్యాలయం లో రెండు టీవీలను చంపాపేట్ డివిజన్ బారాస సీనియర్ నాయకులు నల్ల రఘుమారెడ్డి జంగారెడ్డి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రఘు మా రెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి దాతల సహకారం ఎంతైనా అవసరమన్నారు. జంగారెడ్డి దంపతులు దేవాలయ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. బసిగూడ జంగారెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ రెడ్డి సుధీర్ రెడ్డి సూచనలు సలహాలతో దేవాలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బారాస అధ్యక్షులు ముడుపు రాజ్ కుమార్ రెడ్డి, యాదిరెడ్డి, మేక సురేందర్ రెడ్డి, సురేష్ గౌడ్, సామ రంగారెడ్డి, అర్చకులు జిన్నా సంతోష్ కుమార్ శర్మ ,శ్రవణ్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు.