కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా, దేశ రక్షణ కోసం అమరులైన సైనికులకు అంజలి ఘటిస్తున్నాము. మన భూమిని రక్షించుకోవడానికి విధి నిర్వహణలో తమ అంతిమ త్యాగం చేసిన మన ధైర్యవంతులకు వందనం అని టీఆర్ఎస్ పార్టీ కూ యాప్ ద్వారా తెలిపింది. అలాగే హరిణి కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా వారి పరాక్రమాన్ని గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల శోకాన్ని తాను కూ ద్వారా పంచుకుంటున్నానని తెలిపారు.
మారక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరసైనికులకు :
దాయాది పాకిస్థాన్‌పై మనం సాధించిన విజయం సామాన్యమైనది కాదు. మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్‌కు విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న విజయ్ దివస్ నిర్వహిస్తోంది. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి నేటికి 23ఏళ్లు పూర్తయ్యింది. మన వీర సైనికుల ధైర్యానికి, పరాక్రమానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచే కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. తమ భారతీయ అమరవీరుల వీర పుత్రులకు వినయపూర్వకమైన నివాళులు. వందనం..