కంటి వెలుగు ఓ అద్భుత కార్యక్రమమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ లో KCR చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అలాగే అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని బాగ్ అంబర్ పేట డివిజన్ రామకృష్ణ నగర్ పార్క్ లో, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని భోలక్ పూర్ డివిజన్ తాళ్లబాస్టి కమిటీ హాల్ లో కంటి వెలుగు శిబిరాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… కంటి చూపు సంబంధ సమస్యల పరిష్కారం కోసం కంటి వెలుగు కార్యక్రమమన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఒక గొప్ప వరమన్నారు. ఉచితంగా కంటి పరీక్షలు, మందులు, కళ్ళద్దాల పంపిణీ చేస్తున్నామన్నారు. కంటి వెలుగు కార్యక్రమం కోసం ప్రభుత్వం 250 కోట్ల రూపాయల ను ఖర్చు చేస్తుందన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప కార్యక్రమం చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement