Saturday, November 23, 2024

మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా జూ. ఎన్టీఆర్

జువెలరీ రిటైలర్‌ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌.. తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నందమూరి తారక రామారావు (జూనియర్‌ ఎన్‌టీఆర్‌)ను నియమించుకుంది. ఈ మేరకు ఎన్‌టీఆర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. పాన్‌ ఇండియా మాస్‌ సూపర్‌ స్టార్‌గా ఉన్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ ప్రచారంతో వినియోగదారులకు మరిం త చేరువయ్యే అవకాశం లభించనుందని మలబార్‌ గోల్డ్‌ వెల్లడించింది. ఈసందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ…. మరోసారి మలబార్ గోల్డ్ & డైమండ్స్‌తో భాగస్వామ్యం వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విశ్వ వ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్లలో ఒకటిగా ఉండటమే కాకుండా, భారతీయ కళాత్మకత, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే డిజైన్లను ప్రపంచ వేదికపై విస్తృతంగా ప్రదర్శిస్తున్నారు. వినియోగదారులే కేంద్రంగా అందించే వాగ్దానాలతో పాటు వారు పాటిస్తున్న ఎన్విరాన్‌మెంట్ సోషల్ గవర్నెన్స్ (ESG) నిబంధనల అమలుతో ఆభరణాల పరిశ్రమలో మలబార్ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసాయి. తాను విశ్వసించే విలువలు, బ్రాండ్ పాటిస్తున్న విలువల మధ్య సమిష్టితత్వం తాను స్పష్టంగా చూస్తున్నానన్నారు.

మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్ మాట్లాడుతూ…. జూనియర్‌ ఎన్టీఆర్ తో తమ టైమ్- టెస్టడ్ అనుబంధాన్ని పునరుద్దరించినందుకు తాము సంతోషిస్తున్నామన్నారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఆరాధించబడే సినీ తారలలో ఒకరిగా ఎన్టీఆర్ ఎదిగారన్నారు. వారి అత్యుత్తమ ఫిల్మోగ్రఫీ చూస్తే, నటనలోని వివిధ క్రాఫ్ట్‌లపై వారికున్న ఆధిపత్యం సుస్పష్టంగా కనిపిస్తుందన్నారు. వారొక అత్యుత్తమ నటుడు, వారి ఆకట్టుకునే వ్యక్తిత్వం మలబార్ బ్రాండ్ విలువను మరింత పెంచుతుందన్నారు. ఎన్టీఆర్ తో గతంలో తమకు అద్భుతమైన అనుబంధం ఉందన్నారు. ఆ అనుబంధం మళ్ళీ కొనసాగుతుండటం, ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ 1 రిటైలర్ జ్యువెలరీ బ్రాండ్ గా నిలవాలనే తమ ఆశయం అతి త్వరలో నెరవేరడానికి సహాయపడుతుందన్నారు. ఈ ఏడాది 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో, తమ విలువైన కస్టమర్లకు ప్రపంచ స్థాయి ఆభరణాల షాపింగ్ అనుభూతితో పాటు పారదర్శకత, ఆభరణాల డిజైన్లలో వైవిధ్యం, హస్తకళలు, అత్యుత్తమ నైపుణ్యంతో రూపొందించిన ఆభరణాలు అందించడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement