మ్యాట్రిమోనీ.కామ్ భారతదేశంలో అగ్రశ్రేణి ఆన్లైన్ మ్యాట్రిమోనీ కంపెనీ, ప్రజానీకం కోసం ప్రత్యేకంగా వివాహ సంబంధాల ప్రాంతీయ భాషా యాప్- జోడీని ప్రారంభిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ సేవ హిందీలో, మరాఠీ, బెంగాలి, పంజాబీ, గుజరాతీ, తమిళం అండ్ తెలుగుతో సహా 9 ఇతర భాషల్లో లభిస్తుంది. గత 22 ఏళ్ళుగా లక్షల మంది భారతీయులకు ఒక జీవిత భాగస్వామిని కనుక్కోవడంలో సాయపడిన తమ విజయవంతమైన చరిత్ర ఆధారంగా ఈ కొత్త సేవను కంపెనీ ప్రారంభించింది. ఈసందర్భంగా మ్యాట్రిమోనీ.కామ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అర్జున్ భాటియా మాట్లాడుతూ… పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో, జోడీ ఒక సరళమైన సాంకేతిక పరిష్కారమన్నారు. తమ కలల్లోని జీవిత భాగస్వామిని వెతకడంలో ప్రతి సాధారణ భారతీయుడికీ ఎదురయ్యే అవరోధాలను అది తొలగిస్తుందన్నారు. ఒక సంబంధాన్ని వెతకడంలో ఎంపికను, సౌకర్యాన్నీ, భధ్రతను జోడీ అందిస్తుందన్నారు. తమ జీవితాలపై సానుకూల ప్రభావం చూపించే నిర్ణయాలను తీసుకొనే సాధికారతను కూడా మహిళలకు కల్పిస్తున్నామని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement