Saturday, November 23, 2024

ఉద్యాన‌వ‌నంలో ఉద్యోగాల్లేమీ……

హైదరాబాద్‌, : ఉద్యాన వన శాఖ సాయం కోసం ఎదురు చూస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. గత ఏడాది కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ ఏర్పడడం వలన సుమారు 150కి పైగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొల గిం చారు. అనంతరం ఇప్పటివరకు వారి స్థానంలో ఎవరిని ఉద్యోగంలోకి తీసుకోకపోవడంతో పాటు శాఖలో రావాల్సిన ప్రమోషన్లు, కొత్త నియామకాలు ఎక్కడికక్కడే ఆగిపో యాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ కూడా ఆశించిన మేర అందక పోవడంతో అందినదాంతోనైనా ఎలా నెట్టుకు రావాలన్న ఆలోచనలో పడ్డారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటలను ప్రోత్సహించాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు ప్రణాళికలు మొదలుపెట్టినప్పటికీ ఎప్పటి కప్పుడు బడ్జెట్‌ ఆటంకంగా మారినట్టు తెలుస్తోంది.
ప్రధానంగా ఆలుగడ్డ, ఉల్లి, నూనెలు, పప్పు దినుసులతో పాటు సీజనల్‌ పండ్లు, నిత్యావసరాలను తెలంగాణలోనే ఎక్కువుగా పండిస్తే నిత్యావసర ధరల బెడద నుంచి బయట పడొచ్చన్న ముఖ్యమంత్రి ఆలోచన మంచిదే అయినప్పటికీ వాటి సాగుకు అవసరమైన సబ్సిడీలు, యంత్రాలు, పరికరాలు అందించడంలో ఆలస్యం జరుగు తుందన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలీహౌస్‌లకు సంబంధించి ఇప్ప టివరకు రూ.35కోట్ల మేర సబ్సిడీ బకాయిలున్నాయి. అయితే వీటిలో రూ.20కోట్ల వరకు చెల్లించినట్టు శాఖ నుంచి తెలుస్తున్నప్పటికీ ఇంకా రూ.15 కోట్ల మేర బకాయిలున్నాయి. ఇవీ కాక పంటలకు అందించిన డ్రిప్‌, సెరీకల్చర్‌తో పాటు మరికొన్ని పంటలకూ ఇప్పటికీ సబ్సిడీ చెల్లించాల్సి ఉందని సమాచారం. దీంతో బకాయిలు, ఉద్యోగుల జీతాలకే బడ్జెట్‌లో ప్రథమభాగం సరిపోతాయన్నట్టు ఉద్యోగులు చర్చించు కుంటున్నారు.
ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఆయిల్‌ దిగుమతులు పెరుగుతున్న నేప థ్యంలో రాష్ట్రంలోనూ వాటి దిగుమ తులు పెరుగు తున్నాయి. అటు దేశంతో పాటు రాష్ట్ర అవసరాలకు సరిపడా వంట నూనెను తెలంగాణలోనే ఉత్పత్తి చేసుకునేలా ప్రభుత్వం ఆయిల్‌పాం పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ముమ్మరంగా ఏర్పాట్లుచేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనువైన ప్రాంతా లను గుర్తించి వాటిలో సుమారు 8లక్షల 14వేల ఎకరాల్లో పంటను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సుమారు 8లక్షల 14వేల ఎకరాల్లో ఆయిల్‌పాం ను విస్తరిస్తే వాటి నిర్వహణకు మొద టి ఏడాది కనీసం రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు అవసరం ఉం టుందని అధి కారు లు అంచనా వేస్తు న్నారు. కేటా యిం చిన బడ్జెట్‌లోనే ఈ నిధులను విని యాగిస్తే నిధులు అన్ని సబ్సిడీలకు సరి పోవన్నట్టు అధికారుల ద్వారా తెలుస్తోంది.
రూ.400కోట్లు, 600
మంది ఉద్యోగుల కొరత
ప్రస్తుతం బడ్జెట్‌లో ఉద్యానవన శాఖకి రూ.244కోట్లు మాత్రమే కేటా యించారు. కాగా అవసరమైన మిగతా నిధులను వ్యవసాయ శాఖ నుంచి తరలించుకోవచ్చన్న భావన తో ప్రభుత్వం ఉన్నప్పటికీ, సొంత శాఖలో నిధులుం టేనే అవసరాన్ని బట్టి వినియోగించడానికి వీలుగా ఉండడం తో పాటు రైతులకు సరైన సమయంలో సబ్సిడీలు, ఇతరత్రా అవసరాలను తీర్చొచ్చు అనేది అధికారుల భావనగా ఉంది. ఈ నేపథ్యంలో శాఖ ముందకు సాగాలంటే కనీసం రూ.400కోట్లు కేటాయిస్తే బాగుండేదని అధికారులు చర్చించుకుంటున్నారు.
లాక్‌డౌన్‌ కారణంగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించడంతో తాజాగా ప్రభుత్వ ప్రతిపాదనలతో ఉద్యోగుల కొరత శాఖలో కొట్టొచ్చినట్టు కనబడు తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటల ప్రోత్సాహం పెరుగుతున్న నేపథ్యంలో శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయా ల్సిన అవసరం ఉందని అధికారులు భావి స్తున్నారు. దీంతో పాటు కొత్తగా ఆయిల్‌పాం సాగు విస్తరణతో అన్ని పోస్టులు కలుపుకుని సుమారు 600 వరకు ఉద్యోగులు అవసరం పడుతుండడంతో శాఖకు అవసరమైన కొత్త పోస్టులను మంజూరు చేసి భర్తీచేస్తే రైతులకు మరింత ప్రోత్సాహం, అవగాహాన కల్పించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

పండ్ల ఎక్స్ పోర్ట్ ప‌ర‌క‌రాలు అవ‌స‌రం…

రాష్ట్ర వ్యాప్తంగా సాగవుతున్న వివిధ రకాల పండ్లకు సంబంధించి వాటిని ఇతర దేశాలకు ఎక్స్‌పోర్టింగ్‌కు డిమాండ్‌ ఉన్నప్పటికీ వాటికి అవసరమైన పరికరాలు అవసరమైనన్ని లేకపోవడంతో ఇతర దేశాలకు ఎగుమతుల విషయంలో సమస్యలను ఎదుర్కొంటుంది శాఖ. దీంతో ఎగుమతు లకు అవసరమైన పరికరాలను అందించే అంశంలో కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటే బాగుంటుందని శాఖ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement