Friday, November 22, 2024

ఉప ఎన్నిక తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ .. కెటిఆర్

హైదరాబాద్‌, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఉంటాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. నాగార్జునసాగర్‌లో గతంలో పనిచేసిన జానారెడ్డికి, భవిష్య త్తులో పనిచేసే యువకుడు నోముల భగత్‌కు మధ్యలో పోరుజరుగుతోందని, ప్రజల ఆశీర్వాదంతో టీఆర్‌ఎస్‌ విజ యం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ‘ఆస్క్‌ కేటీఆర్‌’లో భాగంగా ఆదివారం సాయంత్రం ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు 90 నిమిషాల పాటు కేటీఆర్‌ ఓపిగ్గా సమాధానమిచ్చారు. కోవిడ్‌ మళ్లిd విజృంభిస్తున్నందున దానిని అందరం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉం దని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. తనకు తెలిసింత వరకు దేశవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ కొరత ఉందని తెలంగాణలో వ్యాక్సిన్‌ కొరత ఉందా అన్న ప్రశ్నకు సమా ధానంగా చెప్పారు. పశ్చిమబెంగాల్‌, కేరళలో ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుందని అక్కడ ఎవరు గెలుస్తారన్న ప్రశ్నకు జవాబిచ్చారు. ఒక కొడుకుగా తండ్రి కేసీఆర్‌ నుంచి ఏం నేర్చుకున్నారన్న ప్రశ్నకు మనసు చెప్పినట్లు వినాలని నెెర్చుకున్నానని సమాధానమిచ్చారు. తెలంగాణలో లాక్‌ డౌన్‌ పెట్టే అవకాశాల్లేవని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడు తున్నట్లు లాక్‌డౌన్‌ ఉంటుందా అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. మతపరమైన హింసను అదుపు చేయడానికి ఎలా పోరాడతారని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానమిస్తూ విద్య, ఉద్యోగాలు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు వంటి నిజమైన సమస్యలపై ప్రజలను దృష్టిపెట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీతి ఆయోగ్‌ ఒక సలహా మండలి మాత్రమే అని దాని నుంచి ఎక్కువ ఆశించలేమని, కేంద్రం రాష్ట్రాలకు పనితీరు ఆధా రంగా సాయం చేయాలి కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని నీతిఆయోగ్‌పై ఓ ప్రశ్నకు కేటీఆర్‌ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కరోనాతో కుదేలైన ప్రైవేటు టీచర్లకు సాయం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పది, ఇంటర్‌ పరీక్షల వాయిదా ఉంటుందా అన్న ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిని అడగండని సమాధానమిచ్చారు. గ్రామాల్లో సొంత జాగా ఉండి ఇళ్లు నిర్మించుకునే వారి కోసం త్వరలోనే స్కీమ్‌ విధివిధానాలు ప్రకటిస్తామని తెలిపారు. ఫార్మాసిటీ భూ సేకరణ దాదాపు పూర్తి కావచ్చిందని, త్వరలోనే కంపెనీలకు భూములు కేటాయిస్తామని తెలిపారు. ఎంజీ బీఎస్‌ నుంచి ఫలక్‌నుమాకు మెట్రో రైలు మార్గం నిర్మాణాన్ని త్వరలోనే పట్టాలెక్కిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో వరదలను ఎదుర్కోవడానికి ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమంలో భాగంగా వరద నీటి కాలువలు అభివృద్ధి చేయడానికి ఇటీవలే రూ.858 కోట్లు కేటాయించామని తెలిపారు. మూసీ నదిపై ఉన్న ఆక్రమణలను కచ్చితంగా తొలగించి తీరుతామని హామీ ఇచ్చారు. టీ హబ్‌ ఫేజ్‌ 2 భవనం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందన్నారు. ఐటీ గ్రిడ్‌ పాలసీలో భాగంగా నాచారాం చర్లపల్లి ఐటీ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు ప్రైవేటు డెవలపర్లకు పనులు అప్పగిం చేందుకు నిర్ణయించామన్నారు. ఐటీ పరిశ్రమలను హైదరాబాద్‌ నగరంలో క్లస్టర్ల వారిగా అభివృద్ధి చేయడంతోపాటు ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ పరిశ్రమను విస్తరిస్తామన్నారు. నిజా మాబాద్‌లో పసుపు బోర్డు తెస్తామని బాండ్‌ పేపర్‌ రాసిచ్చిన వారిని అడగండని పసుపుబోర్డు వస్తుందా అన్న ప్రశ్నకు సమాధా నమిచ్చారు. ‘ఉప్పల్‌ స్కైవేను వచ్చే 10 నుంచి 12 నెలల్లో పూర్తి చేస్తాం. వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేసే యత్నాలు కరోనా ప్రభావంతో కాస్త నెమ్మదించినప్పటికీ భవిష్యత్తులో కచ్చి తంగా పూర్తి చేస్తాం. వ్యాక్సి నేషన్‌ విధివిధానాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఫైబర్‌ గ్రిడ్‌ను పట్టణాలకు విస్తరించే కార్యక్రమాన్ని ఇటీవలే చేపట్టాం. కాంట్రాక్టు డాక్టర్ల ఉద్యోగ భద్రత అంశాన్ని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి తీసుకెళ్తా. ఆర్‌ఆర్‌ఆర్‌ రూపురేఖల ప్రణాళికపై కసరత్తు జరుగుతోంది. భూ సేకరణకు ఇటీవలి బడ్జెట్‌లో నిధులు కేటాయించాం. హైదరాబాద్‌ నగరంలో 50కి పైగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను నిర్మిస్తున్నాం. పబ్లిక్‌ టాయిలెట్‌ల నిర్మాణంలో జీహెచ్‌ఎంసీ బాగా పనిచేస్తోందని, అయితే వాటిని ధ్వంసం చేసేవారి నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులపైనే ఉంటుంది’ అని చెప్పారు.
జాతిరత్నాలు సినిమాలో ఫుల్‌ కామెడీ ఉంది…
వ్యాక్సినేషన్‌పై పాటకు తమన్‌కు గ్రీన్‌సిగ్నల్‌…
జాతిరత్నాలు సినిమా ఫుల్‌గా నవ్వుకునేలా ఉందని చెప్పారు. తెలంగాణలో వ్యాక్సినేషన్‌పై ఒక పాట చేయమంటారా సార్‌ అని వర్థమాన మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ అడిగిన ప్రశ్నకు చేయండి బాగుంటుందని సమాధానమిచ్చారు. తన ఫేవరెట్‌ క్రికెటర్‌ ఒకప్పుడు రాహుల్‌ ద్రావిడ్‌ అని ఇప్పుడు మాత్రం విరాటో కోహ్లీ అని కేటీఆర్‌ చెప్పారు. కేటీఆర్‌ గతంలో ఒక ఫొటో పోస్టు చేసి మీరు బాలివుడ్‌, హాలీవుడ్‌లో ప్రయత్నించలేదా సార్‌ అన్న ప్రశ్నకు నన్ను మరీ చెట్టెక్కించేస్తున్నారని కేటీఆర్‌ చమత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement