Friday, September 20, 2024

Jagityala – గణపయ్య మెడలో “నాగాభరణం”

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఒక వింత చోటుచేసుకుంది.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం పూజలు అందుకుంటున్న గణపతి మెడలోకి ఒక నాగుపాము చేరి ఆభరణంగా మారింది. పట్టణంలోని వాణి నగర్ లో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో 48 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

భారీ విగ్రహంతో పాటు చిన్న గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి సోమవారం ఉదయం భక్తులందరూ పూజిస్తుండగా ఒక నాగుపాము వచ్చి పూజలు అందుకుంటున్న గణపతి మెడలోకి చేరింది. శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగుపాము ఆయన కుమారుడైన గణపతి మెడలోకి వచ్చి చేరిందంటూ భక్తులు విశేషంగా చెప్పుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement