Monday, September 16, 2024

HYD: చిత్కారా విశ్వవిద్యాలయం నుంచి డి.లిట్ అందుకున్న జాగల్ వ్యవస్థాపకుడు రాజ్ పి నారాయణమ్‌

హైదరాబాద్ : జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు అండ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాజ్ పి నారాయణమ్‌కు పంజాబ్‌లోని చిత్కారా విశ్వవిద్యాలయం హానరరీ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ (హానోరిస్ కాసా) డిగ్రీని ప్రదానం చేసింది. ఫిన్‌టెక్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు ఆయన అందించిన విశేషమైన సహకారానికి ఈ గౌరవం లభించింది. ఫిన్‌టెక్ రంగంపై రాజ్ పరివర్తన ప్రభావం అతని దూరదృష్టి గల నాయకత్వం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో నిబద్ధత ద్వారా వెల్లడించబడింది. దాదాపు 47 విభిన్న వ్యాపారాల్లో అతని వ్యూహాత్మక పెట్టుబడులు భారతదేశం స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో కీలక వ్యక్తిగా అతని పాత్రను సుస్థిరం చేశాయి.

ఈసందర్భంగా డి.లిట్‌కు అంగీకారం తెలుపుతూ తన కృతజ్ఞతలు వెల్లడించిన రాజ్ మాట్లాడుతూ… చిత్కారా విశ్వవిద్యాలయం నుండి ఈ ప్రతిష్టాత్మకమైన డిగ్రీని అందుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. ఫిన్‌టెక్ పరిశ్రమ అండ్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వృద్ధికి మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నానన్నారు. చిత్కారా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సంధీర్ శర్మ, రాజ్ చేసిన సేవలను ప్రశంసిస్తూ… భారత్ వ్యవస్థాపక రంగంలో రాజ్ పి నారాయణమ్ కీలక వ్యక్తి అన్నారు. ఫిన్‌టెక్ పరిశ్రమలో అతని నాయకత్వం, యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో అతని అంకితభావం ఈ గౌరవానికి అర్హులుగా చేశాయన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement