హైదరాబాద్ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన ఐటెల్ దాని ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐటెల్ ఎస్23 ను సబ్-9కే కేటగిరీలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశపు మొదటి 16 జీబీ ర్యామ్ ఫోన్ ఇది. ఈ ఆవిష్కరణ పై ఐటెల్ ఇండియా సీఈఓ అరిజీత్ తలపాత్ర మాట్లాడుతూ… వినియోగదారులు చాలా ఆప్రమప్తతతో ఉన్నారన్నారు. వారి ఇష్టాలు, ఎంపికలు, ఫ్యాషన్ అంశాల పరంగా తమకు కావాల్సినవి డిమాండ్ చేస్తున్నారన్నారు.
అదీ కాక వినియోగ విధానాల్లో సైతం పెద్ద మార్పు వచ్చిందన్నారు. మొబైల్‌లు ఇకపై కేవలం పరికరాలు మాత్రమే కాదు, కొత్త భారత్‌లో వినోదం, జీవనశైలిలో అంతర్భాగంగా మారాయన్నారు. ఐటెల్‌లో తాము అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ లుక్స్, నూతన తరపు సాంకేతికతతో కూడిన ఆవిష్కరణలను తీసుకురావడం ద్వారా తమ వినియోగదారులకు సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.