Tuesday, November 26, 2024

TG | హైదరాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి మోస్త‌రు వర్షం కురుస్తొంది. నగరంలోని మియాపూర్, కేపీహెచ్ బీ కాలనీ, ప్రగతినగర్, బాచుపల్లి, కూకట్ పల్లి, మూసాపేట, హైదర్ నగర్, మల్కాజిగిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, చర్లపల్లి, నిజాంపేట, అమీర్ పేట్, ఎర్రగడ్డ, సనత్ నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, ఉప్పల్, రామంతాపూర్, నాంపల్లి, మేడ్చల్, మల్లంపేట్, గండిమైసమ్మ, దుండిగల్, అంబర్ పేట, కాచిగూడ, నల్లకుండ, గోల్నాకతోపాటు పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్త‌రు వర్షం కుర‌వ‌డంతో వరద నీరు రోడ్లపైకి చేరుతొంది. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.

రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ వర్షాలు..

ఇక‌ తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. శుక్రవారం నుంచి శనివారం వరకూ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు.

అలాగే, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement