ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ సేవల విస్తరణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ సేవలు విస్తరించేందుకు సంస్థలు ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్‌లో నిన్న మాస్ మ్యూచువల్ కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఫార్చ్యూన్ 500 కంపెనీగా ఉన్న మాస్ మ్యూచువల్ హైదరాబాద్‌కు రావడం పట్ల ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ‘వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ నగరాల్లో వచ్చే ఐదేళ్లలో 50వేల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే టెక్ మహీంద్రా, సైయంట్, మైండ్ ట్రీ, తాజాగా జెన్‌ప్యాక్ట్ వరంగల్‌కు వచ్చాయి.
ద్వితీయ శ్రేణి నగరాల్లో విస్తరించేందుకు మాస్ మ్యూచువల్ లాంటి సంస్థలు ముందుకు రావాలి. తద్వారా అక్కడి యువతకు మంచి అవకాశాలు వస్తాయి. రాష్ట్రానికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలకు అనుగుణంగా ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తోంది. వ్యాపార రంగానికి హైదరాబాద్ అనుకూలమైనది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వ్యాపారానికి అనేక అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్మాన్, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital