Tuesday, November 26, 2024

బీఎస్‌6 కోసం తమ ఉత్పత్తి శ్రేణిని ఆధునీకరించిన ఇసుజు మోటర్స్‌

ఇసుజు మోటర్స్‌ ఇండియా తమ మొత్తం శ్రేణి పికప్‌ వాహనాలు, ఎస్‌యువీలను ఆధునీకరించడంతో పాటుగా నూతన బీఎస్‌ 6 ఫేజ్‌ 2 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్థారిస్తుంది. తమ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను సమూలంగా ఆధునీకరించడంతో పాటుగా ఎంపిక చేసిన మోడల్స్‌కు నూతన ఫీచర్లను జోడించింది. ఈసంద‌ర్భంగా ఇసుజు మోటర్స్‌ ఇండియా డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తోరు కిషిమోటో మాట్లాడుతూ… త‌మ తాజా శ్రేణి ఉత్సాహపూరితమైన ఉత్పత్తులను పరిచయం చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు. ఇవి మారుతున్న వ్యాపార అవసరాలను, నగర వినియోగదారులు, మోటరింగ్‌ ప్రియుల అవసరాలను తీర్చనున్నాయన్నారు. భారతదేశంలో మొట్టమొదటి లైఫ్‌స్టైల్‌ యుటిలిటీ వాహనం ఇసుజు డీ–మ్యాక్స్ వీ క్రాస్‌ ను పరిచయం చేయడం ద్వారా నూతన ప్రమాణాలను సృష్టించామన్నారు. ఇవి త‌మ విజయగాధను మరింత ముందుకు తీసుకువెళ్తాయన్నారు. విస్తృత శ్రేణి అనుకూల, వైవిధ్యమైన ఉత్పత్తులతో, ప్రతి ఒక్కరికీ ఒక ఇసుజు అనే భరోసా అందిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement