Thursday, November 21, 2024

ఇంట‌ర్ విద్యార్ధుల‌కు ఇంటిలోనే ప‌ర్యావ‌ర‌ణం అసైన్మెంట్ ప‌రీక్ష‌…

హైదరాబాద్‌ : ఇంటర్‌ విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షను అసైన్‌మెంట్‌ రూపంలో నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. అలాగే ప్రాక్టీక‌ల్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ది. ఇక‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షను ఏప్రిల్‌ 1, 3 తేదీల్లో జరపాలని గతంలో ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. కాగా కరోనా తీవ్రత దృష్ట్యా అసైన్‌మెంట్‌ రూపంలో ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది. విద్యార్థులు ఇంట్లోనే అసైన్‌మెంట్‌ రాసి సమర్పిస్తే సరిపోతుందని తెలిపింది. మరోవైపు ఏప్రిల్‌ 7 నుంచి జరిగే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ కూడా వాయిదా పడే అవకాశం ఉందని,. ప్రాక్టికల్స్‌పై ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. కాగా ఈసారి వార్షిక పరీక్షలు లేకుండా పాస్‌ చేసే ఆలోచన లేదన్నారు. మే 1 నుంచి వార్షిక పరీక్షల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు రోజుల్లో హాల్‌ టికెట్లు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement