ఇన్‌స్టాగ్రామ్ సంస్ధ, యంగ్ లీడర్స్ ఫర్ యాక్టివ్ సిటిజన్‌షిప్ (వైఎల్‌ఏసీ) భాగస్వామ్యంతో సోమవారం తమ ప్రతిష్టాత్మక యూత్ ప్రోగ్రామ్ కౌంటర్ స్పీచ్ ఫెలోషిప్ ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈసందర్భంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ మేనేజర్ నటాషా జోగ్ మాట్లాడుతూ… ప్రజలు సృజనాత్మకంగా తమను తాము వ్యక్తీకరించుకునే ప్రాంగణం ఇన్‌స్టాగ్రామ్ అన్నారు. ఈ తరహా సృజనాత్మకత వెలుపలికి రావాలంటే సానుకూల వాతావరణం కావాలన్నారు. ఈ కారణం చేతనే తాము వరుసగా ఆరవ సంవత్సరం ఫెలోషిప్ నిర్వహిస్తున్నామన్నారు. వైఎల్‌ఏసీ కో–ఫౌండర్ రోహిత్ కుమార్ మాట్లాడుతూ… ముందుగా తాము కౌంటర్ స్పీచ్ ఫెలోషిప్‌ను ఆవిష్కరించినప్పుడు దాదాపు 1100 మంది ప్రతిభావంతులు, అభిరుచి కలిగిన ఫెలోస్ సోషల్ మీడియా శక్తిపై ఆధారపడి వైవిధ్యతతో కూడిన ప్రపంచం సృష్టించేందుకు తోడ్పడిందన్నారు. అవసరమైన వారికి తగిన మద్దతునూ అందించిందన్నారు. ఎంతో మంది ఫెలోస్ తమంతట తాముగా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా ఈ కార్యక్రమం వెలుపల నుంచి తమ కుటుంబ సభ్యులు, తమ పాఠశాలలు, కమ్యూనిటీ నుంచి తమ రచనలు, వెబినార్‌లు, ఇన్ల్ఫూయెన్సర్‌లు, విధాన నిర్ణేతలు, సుప్రసిద్ధ పౌర సమాజ సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా నేర్చుకునే అవకాశం కల్పిస్తుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement