హైదరాబాద్ , : అవినీతి డొంకను బైటకు తీసేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కదలుతోంది. మేడ్చేల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్ మండలంలోని దేవరయాంజాల్‌లోని సీతారామస్వామి దేవాలయ భూ ముల కబ్జా భాగోతంపై నిజానిజాలను తేల్‌ఇ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు నలుగురు ఐఏఎస్‌లతో ఉన్నతస్థాయి అధ్యయన కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే ఆ కమిటీ విచారణను ప్రారంభించింది. ఈ దేవాలయానికి చెందిన 1521.13 ఎకరాల దేవాదాయ భూములలో కబ్జాలు, నిబంధనలకు వ్యతి రేకంగా క్రయవిక్రయాలు జరిగినట్లుగా అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భూములను మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఇతరులు కబ్జాలకు పాల్పడి నట్లు గా వార్తా పత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా వా స్తవా లను వెలికి తీసేందుకు పంఆయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్‌రావు నేతృత్వంలో నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళి కేరి, మేడ్చేల్ కలెక్టర్ శ్వేతా మహంతిలతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది.
ఈ కమిటీ కింది విషయాలను పరిశీలించనుంది…
భూముల కబ్జా, కబ్జాకు గురైన భూ విస్తీర్ణం, కబ్జాదారుల వివరాలు. ఫిర్యాదులు అందిన భూముల స్థ్థితిగతులు. ఆక్రమణలు ఎలా జరిగాయి, వాటిని వినియోగిస్తున్న తీరు. ఆక్రమణ దారుల వద్ద ఉన్న డాక్యుమెంట్లు, పత్రాల వివరాలు. కబ్జా భూముల ప్రస్తుత తీరు. కబ్జాదారులకు చెందిన రికార్డులు, డాక్యుమెంట్ల వివరాలు. ప్రభుత్వ సంస్థల నుంచి వారికి ఏమైనా పర్మిషన్లు, అనుమతులు ఇస్తే వాటి వివరాలు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా జరిగిన ఉల్లంఘనలు. ఖాళీగా ఉన్న భూముల వివరాలు. భూ కబ్జాలకు పాల్పడిన వారి బినామీలు, ఇతర పెద్దల వివరాలు. దేవాలయానికి జరిగిన రాబడి నష్టం వివరాలు. చర్యలకు తీసుకోవాల్సిన సిఫార్సులు. ఈ కమిటీ వీలైనంత తొందరగా ఆయా స్థలాల్లో పరివీలన చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
రంగంలోకి ఐఏఎస్‌ల కమిటీ లిక్కర్ గోదాంలో పరిశీలన
మేడ్చేల్ జిల్లా శామీర్‌పేట్ మండలం దేవరయాంజల్ దేవాదాయ భూములపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణ మొదలు పెట్టింది. సోమవారం నలుగురు ఐఏఎస్‌లతో ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ రంగంలోకి దిగింది. రఘునందన్‌రావు నేతృత్వంలోని కమిటీలో ప్రశాంత్ జీవన్ పాటిల్, భారతీ హోళికేరి, శ్వేతామహంతిలు సోమవారమే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇతరులు ఆక్రమణలు చేసినట్లుగా భావిస్తున్న భూముల్లో పర్యటించారు. ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులు, వార్తా కథనాల ఆధారంగా దేవరయాంజల్‌లోని మాజీ మంత్రి ఈటెలకు చెందిన 12ఎకరాల్లోని షెడ్లను, లక్ష చదరపు అడుగుల్లో నిర్మించిన మద్యం గోడౌన్ను పరిశీలించారు. ఇక్కడి వాస్తవ స్థితిగతులను, ఆధారాలను సేకరించారు.
దేవరయాంజాల్ భూముల కబ్జాలపై విచారణ ప్రారంభం….
Advertisement
తాజా వార్తలు
Advertisement