Tuesday, November 26, 2024

అరవై మంది నిరుపేద బాలికలకు సంతోషాన్ని అందించిన ఇనార్బిట్‌ మాల్‌

తెలంగాణా రాష్ట్ర మహిళాభివృద్ధి, బాలల సంక్షేమ శాఖతో పాటుగా నిర్మాణ్‌ డాట్‌ ఓఆర్‌జీ సంస్థతో భాగస్వామ్యం చేసుకుని ఇనార్బిట్‌ హైదరాబాద్ గురువారం మాల్‌ లో గాళ్స్‌ డే ఔట్‌ ఇన్‌ ఇనార్బిట్‌ కార్యక్రమం నిర్వహించింది. దాదాపు 60 మంది నిరుపేద బాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేట్‌ హోమ్స్‌కు చెందిన ఈ 15–22 సంవత్సరాల బాలికలు, యువతులు మాల్‌లో వినోదాత్మక క్రీడలతో పూర్తి ఆనందానుభూతులను సొంతం చేసుకున్నారు. ఈసంద‌ర్భంగా హైదరాబాద్ ఇనార్బిట్‌ మాల్ సెంటర్‌ హెడ్ శరత్‌ బెలావడి మాట్లాడుతూ… త‌మ మాల్‌లో నిరుపేద బాలికలకు ఆనందాన్ని తీసుకువస్తూ కార్యక్రమం నిర్వహించడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. ఇక్కడ వారు పూర్తి ఆనందానుభూతులను సొంతం చేసుకున్నారన్నారు. వారికి కేవలం వినోదం అందించడం మాత్రమే కాకుండా ఎలా ఉపాధిని పొందవచ్చో కూడా వారికి వివరించామన్నారు. స్త్రీ, శిశు,దివ్యాంగ సీనియర్‌ సిటిజన్స్‌ శాఖ కమిషనర్‌, సెక్రటరీ దివ్య దేవరాజన్‌, ఐఏఎస్ మాట్లాడుతూ… ఈ తరహా మరిన్ని కార్యక్రమాలను ఇనార్బిట్‌ నుంచి ఆశిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement