Tuesday, November 26, 2024

ఏ రాష్ట్రంలో లేని విధంగా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు .. ఉప్పల శ్రీనివాస్ గుప్తా

మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ పాఠశాలలను, గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఐవీఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్, విక్టోరియా మెమోరియల్ రెసిడెన్సియల్ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు ఉచిత క్రీడా సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. మీరు మంచిగా చదువుకొని జీవితంలో స్థిరపడి మీకు సాయం అందించినందుకు గాను రాబోయే రోజుల్లో మీరు కూడా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇతరులకు సహకరించండి ఖచ్చితంగా సాయం అందించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.

పుట్టిన ఊరును, తల్లిదండ్రులు, గురువులను మరవద్దని మంచి ఆలోచనతో సేవ చేసేందుకు ముందుకు రావాలని కోరారు. పర్యాటక రంగంలో తెలంగాణను తెలంగాణ హబ్ లాగా తీర్చిదిద్దుతున్నారన్నారు. రామప్ప టెంపుల్ కి యునెస్కో గుర్తింపు రావడం తెలంగాణకు గర్వకారణమన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించి చేనేత రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. చేనేత కార్మికులకు సామాజిక న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. పీవీ సింధు, సచిన్ టెండూల్కర్ లను స్పూర్తితో విద్యతో పాటు క్రీడల్లో రాణించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి మంచి మెరిట్ సాధించి, పాఠశాలకు, తల్లిదండ్రులకు, రాష్ట్రానికి పేరు తేవాలని పిలుపునిచ్చారు. తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో.. శ్రీ విష్ణు జగతి శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్, అతిధులు శ్రీహరి కృష్ణయ్య సరూర్ నగర్, ఉప కమీషనర్, విజయ గౌడ్ విశిష్ట ఫౌండేషన్ చైర్మన్ లయన్ డాక్టర్ కొట్టటం జంగయ్య యాదవ్, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ 320, శివ పార్వతి ప్రిన్సిపాల్ విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ పాఠశాల, లయన్ డాక్టర్ బి.విజయ రంగ, కోఆర్డినేటర్ ఎల్.బి.నగర్, మహేశ్వరం,
శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement