Tuesday, November 26, 2024

Indrasenareddy – అట్టడుగు వర్గాలకు వైద్యం , విద్య అందించడానికి మరింత కృషి చేస్తా – త్రిపుర గవర్నర్

. ఎల్ బి నగర్ నవంబర్ 09 ప్రభ న్యూస్.మారుమూల గ్రామాల అట్టడుగు వర్గాలకు వైద్యo విద్య అందించడానికి మరింత కృషి చేస్తానని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేన రెడ్డి తెలిపారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన నల్లు ఇంద్రసేనా రెడ్డి కి రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులుపిట్ట శ్రీనివాస్ రెడ్డి రెడ్డి నేతత్వంలో గురువారం, సాయంత్రం మన్సూరాబాద్ఎం ఈ రెడ్డి గార్డెన్స్ లో ఆత్మీయ పౌర సన్మానం వేడుకగా నిర్వహించారు.

.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల వలే నా ఉన్నతికి సహకరించిన సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో అతి చిన్న 3 వ రాష్ట్రమైన త్రిపుర గవర్నర్ గా ఎన్నికైన నేను అక్కడ ఎక్కువగా ఉన్న ట్రైబల్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఈశాన్య ప్రాంత సంస్కృతిని దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడం కోసం పాటుపడతానన్నారు. నాపై నమ్మకం ఉంచి గవర్నర్ గా నియమించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతగా పనిచేసే నా మార్కుచూపిస్తానని తెలిపారు. రాజకీయ ఎదుగుదలకు సహకరించిన ఎల్బీనగర్ ప్రజల ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు.

ఆనంతరం. బిజెపి నాయకులు, కాలనీవాసులు, రెడ్డి సంఘం నాయకులు గవర్నర్ నుఇంద్రసేనా రెడ్డినీ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి బిజెపి డిప్యూటీ నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి, మొద్దులచ్చి రెడ్డి, సంరెడ్డి బాల్ రెడ్డి, కళ్లెం రవీందర్ రెడ్డి, వనపల్లీ శ్రీనివాస్ రెడ్డి, సంఘం ఎల్బీనగర్ అధ్యక్షులుగంగాదాసు కృషా రెడీ, సుధాకర్ రెడ్డి, నందికొండ గీతారెడ్డి, సునీత రెడ్డి , కవిత రెడ్డి,చిర్కా నర్సిరెడ్డి, మోహన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement