Tuesday, November 26, 2024

HYD: ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 ని ఆవిష్కరించిన వీబాక్స్

హైద‌రాబాద్ : ప్రముఖ రిమోట్ ప్రొక్టార్డ్ అసెస్‌మెంట్స్, కన్సల్టింగ్ సర్వీసెస్‌ సంస్థ, అయిన వీబాక్స్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 ని విడుదల చేసింది. ఇది దేశంలోని శ్రామిక శక్తిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరివర్తన ప్రభావాన్ని వెలుగులోకి తెస్తూ భవిష్యత్ పని, నైపుణ్యం అండ్ చలనశీలతపై ఏఐ ప్రభావం అనే థీమ్ కింద విడుదల చేసింది. ఈసందర్భంగా ఇండియా స్కిల్స్ రిపోర్ట్ చీఫ్ కన్వీనర్, వీబాక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ నిర్మల్ సింగ్ మాట్లాడుతూ… తాము ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024ని ఆవిష్కరించినప్పుడు మన దేశం ఏఐ ల్యాండ్‌స్కేప్ పై ఈ పరిజ్ఞానంతో కూడిన అన్వేషణకు సహకరించిన వారందరికీ తాను తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. గ్లోబల్ ఏఐ విప్లవానికి నాయకత్వం వహించే భారతదేశం సామర్ధ్యం, మనల్ని నిర్వచించే శక్తివంతమైన ఐటీ ల్యాండ్‌స్కేప్‌తో పాటు మనం సాధించిన ముఖ్యమైన పురోగతిలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

ఈటీఎస్ ఇండియా అండ్ దక్షిణాసియా కంట్రీ మేనేజర్ సచిన్ జైన్ మాట్లాడుతూ… వ్యక్తిగతీకరణ, విశ్లేషణలు, సహజమైన వివరణలు, ఏఐ లేకుండా సాధించలేని కార్యాచరణ పరిజ్ణానం ద్వారా అది ఎలా అన్వయించబడుతుంది, విస్తరించబడుతుందనటంలోనే వుందన్నారు. ఐఎస్ఆర్ నాలెడ్జ్ పార్టనర్ టాగ్డ్ వ్యవస్థాపక సభ్యుడు అండ్ సీఈఓ దేవాశిష్ శర్మ మాట్లాడుతూ… 2024 సంవత్సరంలో మరిన్ని కంపెనీలు తమ నైపుణ్యం పెంచే కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టడాన్ని చూస్తాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement