హైదరాబాద్, ఆంధ్రప్రభ: అరుదైన వ్యాధులతో బాధపడుతున్న ప్రపంచ జనాభాలో 25శాతం మంది భారతదేశంలోనే ఉన్నారని అరుదైన వ్యాధులపై జరిగిన సదస్సులో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ ఏటా 250 కొత్త వ్యాధులు ఉనికిలోకి వస్తున్నాయని, ఇవి ఇప్పటికే గుర్తించిన 700 రకాల రోగాలకు అదనమని చెప్పారు. దాదాపు 80శాతం అరుదైన వ్యాధులు జన్యుమార్పుల మూలంగా సంభవిస్తుంటే… ఇందులో ఎక్కువగా చిన్నారులనే బాధిస్తున్నాయని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు ఈ వ్యాధుల్లో 30శాతం దాకా చిన్నారులు అయిదేళ్లు దాటే వరకు బహిర్గతం కావడం లేదని హెచ్చరించారు..
దేశంలోని ప్రతి లక్ష మంది జనాభాలో 90మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్య గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసిజేస్ (ఐఓఆర్‌డీ) సంస్థ ప్రత్యేక సదస్సును నిర్వహించింది. అరుదైన వ్యాధుల కట్టడికి అల్లోపతిలో ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుగుతున్నా నిధుల కొరత వల్ల జనానికి అందుబాటులోకి రాలేకపోతున్నాయని సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.