Wednesday, November 20, 2024

ఐటి లీడర్ల కోసం ఐఎంటీ, హెచ్ సీఎల్ అవగాహన ఒప్పందం

హైదరాబాద్ : ప్రముఖ సాంకేతిక సేవలు, కన్సల్టింగ్ కంపెనీ అయిన హెచ్ సీఎల్ టెక్నాలజీస్, ఐఎంటీ హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) లో ప్రత్యేకత కలిగిన ఒక వినూత్నమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించడానికి, అందించడానికి అవగాహన ఒప్పందం ద్వారా చేతులు కలిపాయి. ఈ సంద‌ర్భంగా ఐఎంటీ హైదరాబాద్‌లో డైరెక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ కె.శ్రీహర్ష రెడ్డి, హెచ్ సీఎల్ టెక్నాలజీస్ పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూనే ఐఎంటీ హైదరాబాద్‌తో వారి భాగస్వామ్య విజన్‌ను గురించి వెల్లడించారు. ఆయన పీజీడీఎం ఐటీ ప్రోగ్రామ్ ప్రారంభాన్ని ప్రకటించారు. దీనికి కార్పొరేట్ భాగస్వాముల నుండి పూర్తి మద్దతు లభిస్తుందన్నారు. నేటి వ్యాపార దృశ్యంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వేగవంతమైన డిజిటలైజేషన్, ప్రాముఖ్యతను డాక్టర్ రెడ్డి నొక్కి చెప్పారు.

కార్పొరేట్ అతిథులు, మీడియాతో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ డైరెక్టర్ హెచ్‌ఆర్, ఆశిష్ భల్లా మాట్లాడుతూ.. పరిశ్రమ, విద్యాసంస్థలు కలిసి రావడం, తమ భాగస్వామ్యం వాటాదారులకు సహాయం చేయడంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పీజీడీఎం ఐటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినందుకు ఐఎంటీహెచ్, హెచ్ సీఎల్ టెక్‌ని తెలంగాణ ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అభినందించారు. ఈ తరహా భాగస్వామ్యాల ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయడంలో ఐఎంటీ హైదరాబాద్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్ సహకార ప్రయత్నాలను తాము అభినందిస్తున్నామన్నారు.
తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఎస్కే జోషి మాట్లాడుతూ… ఈ భాగస్వామ్యం ఔత్సాహిక ఐటీ నిపుణుల నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తుందన్నారు. పరిశ్రమకు సంబంధించిన జ్ఞానం, నైపుణ్యంతో వారిని సన్నద్ధం చేస్తుందన్నారు. ఇది తెలంగాణను సాంకేతిక హబ్‌గా ఉంచాలనే త‌మ దృష్టికి అనుగుణంగా ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement