Wednesday, September 18, 2024

Almonds: రోజువారీ ఆహారంలో బాదం ప్రాముఖ్యత అవ‌స‌రం…

హైద‌రాబాద్: సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల్య, పోషకమైన ఆహారం చాలా ముఖ్యమైనది. సరైన పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను నొక్కిచెప్పడానికి మనం సెప్టెంబర్ 1 నుండి 30 వరకు జాతీయ పోషకాహార మాసాన్ని జరుపుకుంటాము. ఇది పోషకాహార సమస్యలను పరిష్కరించడానికి, అవగాహన కల్పించటానికి, మెరుగైన ఆహార ఎంపికలు చేయడంలో వ్యక్తులు, సంఘాలను భాగస్వామ్యం చేయడానికి ఒక వేదికను అందిస్తుంది.

ఈసంద‌ర్భంగా బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ… తాను ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను శ్రద్ధగా అనుసరిస్తాను. ప్రతి భోజనంలో పోషకాలు అధికంగా ఉండే బాదం పప్పుల వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ని తీసుకువెళ్లేలా చూసుకుంటానన్నారు. ఢిల్లీలోని మాక్స్ హెల్త్‌కేర్‌లోని జాతీయ పోషకాహార మాసం ప్రాంతీయ అధిపతి రితికా సమద్దర్ మాట్లాడుతూ… బరువు, హానికరమైన కొలెస్ట్రాల్ అండ్ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం వంటి వివిధ ఆరోగ్య ప్రయోజనాలలో సహాయపడే బాదం వంటి ఆహారాలను మీ ఆహారంలో చేర్చడం చాలా ముఖ్యన్నారు. న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్, షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ… బాదంపప్పు వంటి సహజ పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను మనం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

ఫిట్‌నెస్ మాస్టర్, పీలాట్స్ ఇన్‌స్ట్రక్టర్ యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ… రెగ్యులర్ వర్కవుట్‌లతో పాటు, బాదం వంటి సహజ ఎంపికలపై దృష్టి పెట్టాలని తాను త‌న క్లయింట్‌లకు గట్టిగా సలహా ఇస్తున్నానన్నారు. బాదం ప్రోటీన్ అద్భుతమైన మూలమ‌న్నారు. పోషకాహార నిపుణులు డాక్టర్ రోహిణి పాటిల్ మాట్లాడుతూ… తమ ఆహారంలో బాదం వంటి ఆహారాలను ఏదో ఒక రూపంలో చేర్చుకోవాలని తాను ఎల్లప్పుడూ సూచిస్తున్నానన్నారు.

- Advertisement -

చర్మ నిపుణుడు అండ్ కాస్మోటాలజిస్ట్, డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా మాట్లాడుతూ… మీ దినచర్యలో బాదంపప్పులను తీసుకోవడం వల్ల సహజంగానే యువి కిరణాలకు మీ చర్మం నిరోధకతను పెంచడంలో సహాయపడుతుందన్నారు. దక్షిణ భారత నటి వాణీ భోజన్ మాట్లాడుతూ… బాదం వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను త‌న దినచర్యలో చేర్చుకోవడం వల్ల నా మొత్తం ఆరోగ్యంలో గుర్తించదగిన మార్పు వచ్చిందన్నారు. తాను బాదం పప్పులను తినడాన్ని ఆస్వాదిస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement