హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన స్వీడిష్ ఓమ్నిచానెల్ గృహోపకరణాల రిటైలర్ ఐకియా, తమ ఈ-కామర్స్ డెలివరీలను మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 62 జిల్లాల్లో వేల సంఖ్యలో పిన్ కోడ్‌లకు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఐకియా స్టోర్‌ల వద్ద షాపింగ్ చేయడానికి సమీపంలోని నగరాలు మరియు పట్టణాల నుండి వస్తోన్న వేలాది మంది కస్టమర్‌ల ఉత్సాహం, డిమాండ్, సందర్శనలను చూస్తూనే ఉన్నందున ఈ సేవల విస్తరణ జరిగింది.
ఈసందర్భంగా ఐకియా ఇండియా సీఈఓ అండ్ సీఎస్ఓ సుసానే పుల్వెరెర్ మాట్లాడుతూ… ఐకియా గత ఐదు సంవత్సరాలుగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి అశేష సంఖ్యలో కస్టమర్ ప్రేమ, నమ్మకాన్ని పొందిందన్నారు. ఈ మార్కెట్‌లలో తమ పరిధిని మరింత విస్తరించడం అంటే తమ కస్టమర్‌లకు ఐకియాని మరింత అందుబాటులోకి తీసుకురావడం, మరింత సౌకర్యవంతంగా మార్చటం, నిజంగా ఓమ్నిఛానెల్ చేయడమన్నారు.
భారతీయులు తమ ఇళ్ల పట్ల చాలా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారన్నారు. తమ, తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి శారీరక, భావోద్వేగ, మానసిక శ్రేయస్సుకు ఇది ఒక ముఖ్యమైన తోడ్పాటుదారునిగా చూస్తారన్నారు. తమ ఇటీవలి లైఫ్ ఎట్ హోమ్ నివేదిక, మెరుగైన స్టోరేజ్ పరిష్కారాల కోసం, మంచి నిద్రపై దృష్టి పెట్టడం కోసం భారతీయ గృహాల అవసరాలను ప్రధానంగా వెల్లడి చేసిందన్నారు. ఇంటి వద్ద మెరుగైన జీవితాన్ని సృష్టించడం కోసం తమ వద్ద అనేక పరిష్కారాలున్నాయన్నారు.