Sunday, November 17, 2024

వెంటిలేట‌ర్ తో ఐసియులో బెడ్స్ కొర‌త‌‌

హైదరాబాద్‌, : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగు తున్న ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ నిల్వలు నిండుకున్నాయి. ఇక మూడు రోజులకు సరిపడ మాత్రమే టీకా డోస్‌లు ఉన్నాయి. మరోవైపు ప్రయివేటు ఆసుపత్రులు కరోనా పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. దీంతో ఐసీయూ బెడ్లకు కొరత ఏర్పడుతోంది. రానున్న మూడు రోజుల్లో కేంద్రం నుంచి టీకా డోస్‌లు రాకుంటే, వ్యాక్సినేషన్‌ కేంద్రాలను మూసివేయక తప్పదని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజుకు లక్ష డోసుల టీకా ఇస్తున్నారు. గత ఐదు రోజుల్లోనే 5,09,034 మంది తొలి డోస్‌ తీసుకున్నారు. సోమ వారం నాటికి ఇక 4లక్షల డోస్‌లే నిల్వ ఉన్నాయి.
ఐసీయూ బెడ్ల కొరత…
కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో వెంటిలేటర్‌, సీపీఏపీ (కంటిన్యూ పాజిటివ్‌ ఎయిర్‌వే ప్రెషర్‌)తో కూడిన ఐసీయూ బెడ్లకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రయివేటులో 331, ప్రభుత్వ ఆసుపత్రు ల్లో 1711 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. వాటిలో వెంటి లేటర్‌, ఆక్సిజన్‌, సీపీఏపీ సౌకర్యం ఉన్న బెడ్లు చాలా తక్కువ. ఈ క్రమంలో కరోనా రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రయివేటు ఆసు పత్రుల్లో కోవిడ్‌ బెడ్ల వివరాలతో డ్యాష్‌ బోర్డు ఏర్పాటు చేయాలని నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రెండు డోస్‌లు వేసుకున్నా పాజిటివ్‌…
రెండు డోస్‌ల కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నా జాగ్ర త్తలు పాటించాల్సిందేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నాం.. ఇక కరోనా దరి చేరదనుకుంటే పొర బడినట్లేనని తేల్చి చెబుతున్నారు. కరోనా టీకా రెండు డోస్‌లు తీసుకు న్నాక కూడా హైదరాబాద్‌లోనిఓ వైద్యుడి సతీమణి కి వైరస్‌ సోకింది. తీవ్రమైన కరోనా లక్షణాలతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇదే తరహా ఘటనలు వరంగల్‌లోనూ నమోదవు తు న్నాయి. వరంగల్‌ సీకేఎం ఆసుపత్రిలో పని చేస్తున్న ఫార్మా సిస్టుకు కూడా వ్యాక్సినేషన్‌ తర్వాత కరోనా సోకింది. నగరంలోని కీర్తినగర్‌ యూపీ హెచ్‌సీ లో నాలుగు రోజుల కిందట 20 మంది ప్రభుత్వ ఉద్యో గులు కరోనా టెస్టులు చేయించుకున్నారు. అందులో టీకా తీసుకున్న ఏడుగురికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. అయితే, ఇలాంటి వారిలో ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురికా వడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కీలక అవయవాలపై వైరస్‌ దాడి చేయలేదని ఇటీవల ఘటనలు నిరూపిస్తున్నాయని అంటున్నారు.
నేడు రాష్ట్రానికి మరిన్ని టీకా డోస్‌లు
రాష్ట్రంలో కరోనా టీకా కొరత లేదని, నేడు రాష్ట్రానికి మరో 3లక్షలా 60వేల డోస్‌లు రాను న్నాయని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జీ. శ్రీని వాసరావు తెలిపారు. టీకా సరఫరా విషయమై కేంద్రం నుంచి సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు సోమ వారం ఆయన ‘ఆంధ్రప్రభ’ తో ప్రత్యేకంగా మాట్లా డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు టీకా కేంద్రాలు కలిపి 1500 పైగా సెంటర్లలో నిర్విరామంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈ రోజు వరకు 22.5లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్‌ ఇచ్చామన్నారు. అర్హులంతా ముందుగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని డీహెచ్‌ సూచించారు.
ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కోవిడ్‌ బెడ్ల సంఖ్యను పెంచుతోందన్నారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్‌ బెడ్ల కెపాసిటీని డబుల్‌ చేస్తున్నామని, రానున్న రోజుల్లో 40వేల నుంచి 50వేల కోవిడ్‌ బెడ్లను సిద్ధం చేసే దిశగా ముందుకు వెళుతున్నట్లు వివరించారు.

ఔషధాల బ్లాక్‌ మార్కెటింగ్‌పై చర్యలు
రెమిడ్‌సివిర్‌ వంటి కోవిడ్‌ ఔషధాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నియంత్రణా కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమిడిసివిర్‌, ఇతర కోవిడ్‌ ఔషధాలకు ఎలాంటి కొరత లేదన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో కృత్రిమ కొరత ను సృష్టించే వారి ఆటకట్టించేందుకు రాష్ట్ర ఔషధ నియంత్రణశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ పనిచేస్తోందన్నారు. కోవిడ్‌ ఔషధాల ధరల నియంత్రణకు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా, అధిక ధరలకు విక్రయించకుండా పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement