హైదరాబాద్, : ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లోని ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్‌తో కూడిన కోవిడ్ బెడ్లన్నీ నిండిపోయాయి. ఆసుపత్రుల్లో బెడ్‌లు మొద లు ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెమిడిసివిర్ ఔషధం ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది. చివరకు వైద్యులు, నర్సులు, వార్డు బాయిలు తదితర సిబ్బందికి కూడా కొరత ఏర్పడింది. దీంతో వైద్య సిబ్బంది తీవ్రమైన పని ఒత్తిడిలో ఉన్నారు. ఏ రోజుకారొజు కరోనా పాజిటివ్ పేషెంట్ల తాకిడి పెరుగు తుండడంతో ఉన్న పరిమిత వనరులతో పలు ఇబ్బందుల మధ్యన పేషెంట్లకు వైద్యం అందించాల్సి వస్తోందని వైద్య సిబ్బంది వాపోతున్నారు. కరోనా నోడల్ ఆసుపత్రిగా ఉన్న గాంధీ లో ని ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లు ఉన్న వార్డులు పేషెంట్లతో ఫుల్ అయిపోయాయి. ఐసీయూలో 670 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ప్రతీ రోజూ వందల సంఖ్యలో కరోనా పేషెంట్లు గాంధీకి వస్తున్నారు. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లను జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలని, అయితే అందుకు తగిన సంఖ్యలో అనెస్థిషియా వైద్యులు, సీనియర్ నర్సులు లేరని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో కోవిడ్ నోడల్ ఆసుపత్రి అయిన గచ్చిబౌలిలోని టిమ్స్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎనిమిది అంతస్థుల్లో ఆసుపత్రి ఉండగా… అన్ని అంతస్థుల్లోని వార్డులు కోవిడ్ పేషెంట్లతో నిండిపోయాయి. ప్రయివేటు ఆసుపత్రుల్లో ఐసీయూ వెంటిలేటర్‌పై చివరి వరకు చికిత్స పొందిన పేషెంట్లు అంతిమఘడియల్లో టిమ్స్ కు వస్తున్నారు. దీంతో వైద్య సిబ్బందిపై చాలా ఒత్తిడి పడుతోంది.. ఇప్పటికైనా తగినంత మంది సిబ్బందిని నియమించాలని వైద్య సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణకు 150మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
తెలంగాణలో ఆక్సిజన్ కొరత తీరనుంది. మృత్యు వుతో పోరాడుతున్న కోవిడ్ పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టేందు కు 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ హైదరాబాద్‌కు చేరుకుంది. మరో 8 ట్యాంకులను ఓడిశా నుంచి తెప్పించేందుకు ప్రభు త్వం ఏర్పా ట్లు చేస్తోంది. రవాణాశాఖ ఆక్సిజన్ ట్యాంకర్లను సమ కూర్చగా… ఆర్టీసీ డ్రైవర్లు వాటిని హైదరాబాద్‌కు చేరవేశారు.
మొబైల్ ఆక్సిజన్ సెంటర్ల ఏర్పాటు యోచనలో ప్రభుత్వం
ఆక్సిజన్ లభించక ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద, సామాన్య కరోనా రోగుల కోసం మొబైల్ ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది. మొబైల్ ఆక్సిజన్ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతోంది. ఎన్ని సెంటర్లను ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడ నెలకొల్పాలి..? అన్న అంశా లపై త్వరలోనే విధివిధానాలు ఖరారు కానున్నాయి. రానున్న మేలో కరోనా రాష్ట్రంలో మారణహోమం సృష్టించే ప్రమా దం నేపథ్యంలో ప్రభుత్వం కరోనా చికిత్సలో కీలకమైన ఆక్సిజన్ లభ్యతను నివారించేందుకు మొబైల్ ఆక్సిజన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
యధేచ్చగా బ్లాక్ లో ఆక్సిజెన్ అమ్మకాలు…
కరోనా సెకండ్‌వేవ్‌లో చాలా మంది రోగుల్లో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. ప్రతి 100 మంది కరోనా రోగుల్లో అయిదుగురు ఆసుపత్రుల్లో చేరు తుం డగా వారిలో ముగ్గురికి ఆక్సిజన్ అందించాల్సిన అవ సరం ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్‌కు కొరత, డిమాండ్ ఏర్పడింది. కరోనా పేషెంట్ల అవసరాలకు తగినంత ఆక్సిజన్ అందిం చడం గగనమైపోతోంది. ఆసుపత్రులకు దీంతో ఆక్సిజన్ సిలిండర్లను దళారులు బ్లాకులో విక్రయిస్తూసొమ్ము చేసుకుంటున్నారు. ప్రాణవాయువు ధరను అమాంతం పెంచి పేద, సామాన్య కరోనా రోగుల పాలిట యమ కింకరులుగా మారుతూ ప్రాణాలు తీస్తున్నారు. ఒక్కో ఆక్సిజన్ సిలిండర్‌ను రూ.20 నుంచి రూ.30వేల వరకు దళారులు బ్లాకులో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రోగు లకు అంబేలెన్సుల ఏర్పాటు ముసుగులో దళారారులు ఆక్సిజన్ బ్లాక్ దందాను కొనసాగిస్తున్నారు. ఎన్జీవోల పేరుతో ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్‌కు తరలిస్తున్నారు. పోలీసులు ఎన్ని దాడులు చేసి, ఎంత మందిని పట్టుకున్నా ఈ దందా ఆగడం లేదు.