Thursday, September 12, 2024

HYDRAA – అప్పా చెరువు అక్ర‌మాల‌పై హైడ్రా “బుల్” డోజ‌ర్ … కూలుతున్న కట్టడాలు..

హైద‌రాబాద్ – గగన్‎పహాడ్‎లో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాల నేలమట్టం చేస్తున్నారు. శనివారం తెల్లవారుజూము నుండే అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిని అక్రమించి నిర్మించిన కట్టడాలను భారీ బందోబస్తు నడుమ కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రదేశంలోకి ఇతరులను ఎవరినీ అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు.

అప్పా చెరువు మొత్తం విస్తీరణం 34 ఎకరాలు కాగా.. ఇందులో 15 ఎకరాలు కబ్జా చేసి గోడౌన్లు నిర్మించినట్లు హైడ్రా అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమణలు తొలగించాలని నిర్మాణదారులను ముందుగానే హెచ్చరించినప్పటికీ వారిలో ఎటువంటి కదలిక లేకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగింది. 15 ఎకరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను నేట మట్టం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement