Saturday, November 23, 2024

హైదరాబాద్ విద్యార్థినికి రూ.2 కోట్ల జీతం

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థినికి అమెరికాలోని ఓ కంపెనీ భారీగా వేతనం ఆఫర్ చేసింది. ఈనెల 2న ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంఎస్ కంప్యూటర్స్ పూర్తి చేసిన దీప్తి అనే విద్యార్థినికి క్యాంపస్ ఇంటర్వ్యూలో సియాటెల్‌ మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం లభించింది. ఆమె వార్షిక వేతనం రూ.2 కోట్లు. ఈనెల 17న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె తండ్రి డాక్టర్‌ వెంకన్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో క్లూస్‌ టీం విభాగాధిపతిగా ఉన్నారు. బీటెక్‌ తర్వాత జేపీ మోర్గాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరిన యువతి మూడేళ్లు పనిచేశాక రాజీనామా చేసి ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300 మందిలో దీప్తికి అత్యధిక వార్షిక వేతనం లభించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement