Saturday, November 16, 2024

HYD | ఆహార నాణ్యతలో హైద‌రాబాద్ కు ఆఖ‌రి స్థానం!

హైదరాబాద్‌ ఫుడ్‌ అంటే ఇష్టపడని వారు దాదాపు లేరనే చెప్పాలి. విదేశాల నుంచి వచ్చినవారు కూడా హైదరాబాద్‌ బిర్యానీ రుచిని ఆస్వాదిస్తుంటారు. అయితే పరిస్థితి ఇప్పుడు పూర్తిగా తలకిందులైంది. భాగ్యనగరంలో ఆహార నాణ్యతపై నేషనల్ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నిర్వహించిన సర్వే ఫలితాలు హైద‌రాబాదీ ఫుడ్ ల‌వ‌ర్స్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. సర్వే ఫలితాల్లో ఆహార నాణ్యతలో హైదరాబాద్‌ చివరి స్థానంలో నిలిచింది.

నగరంలోని హోటళ్లూ, రెస్టారెంట్లు కనీస ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదంటూ సర్వే ఫలితాలు తేల్చాయి. దేశ వ్యాప్తంగా 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా కల్తీ ఆహారంలో టాప్‌ ప్లేస్‌లో నిలవడం గమనార్హం. గడిచిన రెండు నెలల వ్యవధిలో 84శాతం ఫుడ్‌ పాయిజన్‌ కేసులు భాగ్యనగరంలోనే నమోదయ్యాయంటే ఇక్కడ ఆహార కల్తీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

నగరంలోని దాదాపు 62శాతం హోటళ్లు, రెస్టారెంట్లు గడువుతీరిన పాడైపోయిన కుళ్లిన మాంసంతో చేసిన ఆహారపదర్థాలను వినియోగదారులకు వడ్డిస్తున్నట్లు సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. బిర్యానీ తయారీలో ప్రమాదకరమైన రంగులను వాడుతున్నట్లు శాంపిళ్ల టెస్టింగ్‌ ఫలితాలు నిర్ధారించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement