Sunday, November 24, 2024

TG | ఢిల్లి బాటలో హైదరాబాద్‌.. పడిపోయిన ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ !

హైదరాబాద్‌ నగరంలో పరిస్థితి చేయి దాటిపోతోందని వాతావరణ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఢిల్లి మెట్రో నగరంలో అమలు చేస్తోన్న సరి, బేసి సంఖ్యల విధానాలను ఇక్కడ పాటించక తప్పదన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. పెరిగిపోయిన కాలుష్యంతో ఢిల్లిలో ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించగా కొన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను, సాప్ట్‌వేర్‌ ప్రతినిధులను ఇంటి నుంచి పని చేయాలని ఢిల్లి సర్కార్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే.

కాగా హైదారాబాద్‌ నగరంలో ఆదివారం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ఒక్కసారిగా పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు. కూకట్‌పల్లి, మూసాపేట్‌, బాలానగర్‌, నాంపల్లి, మెహదీపట్నంలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని నివేదికలు పేర్కొన్నాయి.

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 300 దాటిందని, ఇది ప్రమాదకర సూచనను తెలియజేస్తోందని ఈ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీవ్ర చలితో చిన్నారులు, వయోవృద్ధులు గడగడలాడుతుండగా తాజాగా కాలుష్యం పెరిగిపోవడంతో హైదారాబాద్‌లో నెలకొన్న వాతావరణం తీవ్ర ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement