ముషీరాబాద్, (ప్రభ న్యూస్) :ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాల తనఖీలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, గాంధీనగర్ పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీలు చేస్తుండగా రూ. 2 కోట్ల 90 లక్షల నగదును సీజ్ చేశారు. కవాడిగూడ ప్రాగాటూల్స్ చౌరస్తా ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా కారు, ద్విచక్ర వాహన దారుల నుంచి పెద్ద మొత్తంలో నగదు లభించింది.
కారులో తరలిస్తున్న రూ. 2 కోట్ల 9 లక్షల డబ్బును గుర్తించారు. కారులో, ద్విచక్ర వాహనంలో కలిసి వెళ్తున్న దినేష్ కుమార్ పటేల్, సచిన్ కుమార్ విష్ణు బాయి పటేల్, సచిన్, జితేందర్ పటేల్, శివరాజ్ నవీన్‌బాయి మోడీ, రాకేశ్ పటేల్, ఠాకోర్ నాగ్జీ చతుర్జీ @ నాగ్జీలను ఆ డబ్బుకు సంబంధించిన వివరాలను అడుగగా అందుకు తగిన పత్రాలను చూపించలేదు.
దీంతో పోలీసులు రూ. 2 కోట్ల 90 లక్షల నగదును సీజ్ చేయడంతో పాటు ఆరుగురిని అరెస్ట్ చేసి, కారును, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాల తనిఖీలో టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ (ఓఎస్ డి ) పి.రాధాకిషన్ రావు, గాంధీనగర్ ఏసిపి రవికుమార్, గాంధీనగర్ సిఐ రవి, నార్త్ జోన్ కమీషనర్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె.సైదులు, బి.అశోక్ రెడ్డి, పి.జ్ఞానదీప్, జి.నవీన్, ఎస్. నాగరాజు రెడ్డి టీమ్ పాల్గొన్నారు.