Wednesday, November 20, 2024

Hyderabad మెట్రో రెండో ద‌శ నిర్మాణానికి రూ. 24,269 కోట్లు – ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

హైద‌రాబాద్ -మెట్రో రైలు కొత్త మార్గాల పనులకు పరిపాలన అనుమతి లభించింది. ఐదు మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి. కారిడార్ 4లో నాగోల్ – శంషాబాద్, కారిడార్ 5లో రాయదుర్గం – కోకాపేట, కారిడార్ 6లో ఓల్డ్ సిటీ ఎంజిబిఎస్ – చాంద్రాయణగుట్ట, కారిడార్ 7లో మియపూర్ – పఠాన్ చెరు, కారిడార్ 8లో ఎల్బీ నగర్ – హయత్ నగర్, కారిడార్ 9లో ఎయిర్ పోర్టు – ఫోర్త్ సిటీ రానున్నాయి.

మొత్తం నాలుగు కారిడార్లు 76.4 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగనుంది. ఎయిర్ పోర్టు నుంచి ఫోర్త్ సిటీకి 40 కిలోమీటర్లు.. మొత్తం ఐదు కారిడార్లు 116.4కిలోమీటర్ల కొత్త మెట్రో మార్గాల నిర్మాణం జరుగనుంది. రెండో దఫా మెట్రో నిర్మాణానికి 24,269కోట్ల రూపాయల అంచనాలకు ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 7333 (30%), కేంద్రం 4230 కోట్లు (18%), 11693 (48%)కోట్లు అప్పు, 1033 కోట్లు (4%) ప్రైవేట్ సంస్థలు తీసుకురావాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌లో రెండో దశ మెట్రో రైలును నాలుగేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఆరు కారిడార్లలో మొత్తం 116.4 కిలోమీటర్ల మేర మెట్రో లైన్‌ను నిర్మించాలని భావించింది. ఇప్పటి వరకు ఐదు కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌ సిద్ధమైంది. మొదటి దశలో గత ప్రభుత్వాలు రూ.22,000 కోట్లతో పీపీపీ మోడల్‌లో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్‌ను నిర్మించాయి. ప్రస్తుతం రోజూ దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోను వినియోగిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement