Saturday, November 23, 2024

ప్రపంచ హెల్త్ కేర్ హబ్ హైదరాబాద్

హైదరాబాద్‌, : ఇప్పటికే వివిధ రంగాల్లో ప్రపంచ స్థాయి పేరుగాంచిన హైదరాబాద్‌ నగరం హెల్త్‌కేర్‌ హబ్‌గా ప్రఖ్యాతి పొందుతోంది. ఏటా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది పేషంట్లకు తక్కువ ధరలో మెరుగైన ప్రపంచ స్థాయి చికిత్సను ఇక్కడి ఆస్పత్రులు అందిస్తున్నాయి. దేశంలోని ఢిల్లి , ముంబై నగరాలకు ధీటుగా హైదరాబాద్‌ కూడా హెల్త్‌కేర్‌ హబ్‌గా ఎదిగింది. కరోనా కారణంగా గత ఏడాది అంతర్జా తీయ విమానాల రాకపోకలు తగ్గడంతో హైదరాబాద్‌కు విదేశీ పేషంట్ల తాకిడి తగ్గింది. సాధారణ రోజల్లో ప్రతియేటా మూడు లక్షల మంది వివిధ దేశాలకు చెందిన పేషంట్లకు హైదరాబాద్‌కు వచ్చి చికిత్స తీసుకుని పూర్తి ఆరోగ్యంతో స్వదేశాలకు వెళుతున్నారు. అంకాలజీ, ఆర్థోపెడిక్‌, కార్డియాలజీ, స్పైన్‌ సర్జరీ తదితర అన్ని రకాల చికిత్సలు, ట్రీట్‌మెంట్‌ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు ధీటుగా హైదరాబాద్‌లో లభిస్తోంది. పశ్చిమ ఆఫ్రికా, మధ్యదరా తూర్పు దేశాలు.. యెమెన్‌, ఓమన్‌, సౌదీఅరేబియాతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన పేషం ట్లకు హైదరాబాద్‌కు వస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణా లకు ధీటుగా వైద్య సేవలు అందుబాటులో ఉండడంతో పాటు యూరప్‌ దేశాలతో పోల్చుకుంటే తక్కువ వ్యయానికి వైద్యం అందుబాటులో ఉండడం, స్థానికంగా వివిధ మతాల సంస్కృ తి, వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన సర్వీసులు ఉండడం నగరం మెడికల్‌ హబ్‌గా ఎదిగేందుకు అనుకూలిస్తున్నాయి.
యూరోపియన్‌ దేశాలతో పాటు దేశంలోని ఢిల్లిd, ముంబై నగరాలతో పోల్చుకుంటే 30 నుంచి 35 శాతం తక్కువ వ్యయా నికి హైదరాబాద్‌లో విదేశీయులకు వైద్యసేవలు అందుబాటు లో ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఉస్మానియా, ఇఫ్లూ వర్సిటీలు విదేశీ విద్యార్థులకు వివిధ కోర్సులు అందజేస్తున్నా యి. వీరి ద్వారా హైదరాబాద్‌లోని వైద్య సదుపాయాల విశిష్ట తలు ప్రపంచ దేశాలకు చేరుతోంది. విద్యార్థుల కుటుంబ సభ్యు లు, స్నేహితులు, సొంత నగరాల్లోని వ్యక్తులకు హైదరా బాద్‌లో తక్కువ వ్యయానికే నాణ్యమైన వైద్యం అందుతోంద ని విద్యార్థులు రెఫరెన్స్‌ ఇస్తున్నారు. హైదరాబాద్‌లో పేరు పొందిన అపోలో, యశోద, కేర్‌, ఏఐజీ, గ్లోబల్‌, కిమ్స్‌, కామి నేని, మెడికవర్‌ తదితర ఆస్పత్రులు విదేశీ పేషంట్లకు సౌలభ్య ంగా ఉండే విధంగా పలు వైద్య ప్యాకేజీలు అందిస్తు న్నాయి. హైదరాబాద్‌లో విమానం దిగింది మొదలు పేషంట్‌ ను ఆస్ప త్రికి తీసుకువచ్చి ట్రీట్‌ మెంట్‌ చేసి నయమయ్యాక తిరిగి ఎయిర్‌పోర్టులో వదిలేసే విధంగా వైద్య ప్యాకేజీలు అమలు చేస్తున్నాయి. భాషాపర మైన, ఆహారపరమైన ఇబ్బం దులు ఎదురుకా కుండా దుబాసీ ల(ట్రాన్స్‌లేటర్స్‌)ను నియ మించ డంతో చికిత్స సులువవు తుందని ఆస్పత్రుల వైద్యులు చెబుతు న్నారు. దుబాసీలుగా హైదరాబాద్‌లో చదువుతున్న ఆయా దేశాలను విద్యార్థులను నియమించడంతో వారికి కూడా ఉపాధి లభిస్తుందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement