Sunday, November 24, 2024

HYD | వరల్డ్‌ స్మార్ట్‌ సిటీల జాబితాలో హైదరాబాద్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : వరల్డ్‌ స్మార్ట్‌ సిటీల జాబితాలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు స్థానం దక్కింది. దేశంలో ఉన్న ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు.. తర్వాతి స్థానంలో హైదరాబాద్‌ నిలిచింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ సిటీలపై నిర్వహించిన సర్వేలో నాలుగు భారతీయ స్మార్ట్‌ సిటీలు జాబితాలో చేరాయి. అందులో దేశ రాజధాని ఢిల్లీ మహానగరం అగ్రస్థానంలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం దిగజారి 106వ స్థానంలో నిలిచింది. రెండో టాప్‌ ఇండియన్‌ స్మార్ట్‌ సిటీ ముంబై. గత ఏడాదితో పోలిస్తే రెండు స్థానాలు ఎగబాకి ప్రపంచ జాబితాలో 107వ స్థానంలో నిలిచింది. భారత్‌లో స్మార్ట్‌ సిటీల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ గత ఏడాదితో పోలిస్తే 5 స్థానాలు ఎగబాకి ప్రపంచ వ్యాప్తంగా 111వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొత్తం 142 నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రపంచాన్ని ఆకట్టుకునే సుందరమైన ప్రదేశాలు, ప్రజలకు మెరుగైన జీవన సదుపాయాలను అందిస్తున్న నగరాలను స్మార్ట్‌ సీటీలుగా గుర్తిస్తారు. విద్య, వైద్యం, ఉపాధి ఇలా అన్ని రంగాల్లో సత్తా చాటుతూ పేరు తెచ్చుకున్న నగరాలకు అంతర్జాతీయ పెట్టుబడులు, బహుళజాతి సంస్థల పెట్టుబడులు విరివిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ అంశంపై తాజాగా సింగపూర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ డిజైన్‌ (ఎస్‌యూటీడీ) సహకారంతో ఇంటర్నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌ మెంట్‌ డెవలప్‌ మెంట్‌ (ఐఐఎండీ) ప్రపంచంలోని స్మార్ట్‌ సిటీల జాబితాను ఐఎండీ స్మార్ట్‌ సిటీ ఇండెక్స్‌ను విడుదల చేసింది.

ప్రపంచంలోని స్మార్ట్‌ సిటీలను నిర్ణయించడానికి అధ్యయనం ఐదు ప్రధాన అంశాలను తీసుకొని ప్రకటించింది. వీటి ఎంపికలో మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ సేవలు లాంటివాటిని పరిగణనలోకి తీసుకుంది. ఆరోగ్యం, భద్రత, కార్యకలాపాలు, విద్యా వ్యవస్థ, వైద్యం, ప్రభుత్వ పాలన ఏవిధంగా ఉందంటూ బేరీజు వేస్తూ స్మార్ట్‌ సిటీలను ప్రకటించింది. ఈ ఏడాది కూడా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2019 నుంచి ఈ నగరం అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాలోని కాన్‌ బెర్రా, సింగపూర్‌ మినహా ప్రపంచంలోని టాప్‌ టెన్‌ స్మార్ట్‌ సిటీలన్నీ యూరప్‌లోనే ఉన్నాయి.

టాప్‌ స్మార్ట్‌ సిటీల జాబితా..

  1. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌
  2. నార్వేకు చెందిన ఓస్లో
  3. ఆస్ట్రేలియాకు చెందిన కాన్‌బెర్రా
  4. స్విట్జర్లాండ్‌లోని జెనీవా
  5. డెన్మార్క్‌ లోని కోపెన్‌ హాగన్‌
  6. స్విట్జర్లాండ్‌ కు చెందిన లాసానే
  7. యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ లోని లండన్‌
  8. ఫిన్లాండ్కు చెందిన హెల్సింకి
  9. యూఏఈలోని అబుదాబి
Advertisement

తాజా వార్తలు

Advertisement