Saturday, November 23, 2024

Hyderabad CP | ధర్నాచౌక్‌లో ఎవరైనా ఆందోళనలు చేయొచ్చు..

ధర్నా చౌక్ ని యధావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ ధర్నా చౌక్ ని ఆయన పరిశీలించారు. థర్నాచౌక్ పైన డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం కొనసాగింది.

ఈ మీటింగ్ తర్వాత హైదరాబాద్ సీపీ మాట్లాడుతూ.. ధర్నా చౌక్ లో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. ధర్నా చౌక్ లో ఎవరైనా ఆందోళనలు చేపట్టవచ్చు.. ధర్నాలు నడుస్తున్న సమయంలో రోడ్లను మూసివేసే ప్రసక్తి లేదు అని సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement