Sunday, November 24, 2024

HYD: 3 ఫ్లాగ్ షిప్ డిజైనర్ స్టోర్స్ ని ప్రారంభించడంతో డిజైనర్ హబ్ గా హైదరాబాద్

హైదరాబాద్ : ఇప్పుడు హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద డిజైనర్ హబ్ గా అవతరించింది. దానికి కారణం భారతదేశంలోనే ప్రముఖ డిజైనర్లుగా పేరుపొందిన రాహుల్ మిశ్రా, అబ్రహాం అండ్ ఠాకూర్-సత్యపాల టీమ్ ఇక్కడ తమ ఫ్లాగ్ షిప్ స్టోర్స్ ని ప్రారంభించారు. ఇవి హైదరాబాద్ లోని సత్వా సిగ్నేచర్ టవర్ లో ఏర్పాటు చేశారు. ఈ ల్యాండ్‌మార్క్ ఈవెంట్ ద్వారా హైదరాబాద్ ఫ్యాషన్ ల్యాండ్‌స్కేప్‌ సరికొత్తగా పునర్నిర్వచించబడుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో లగ్జరీ రిటైల్ అండ్ హై-ఎండ్ డిజైన్‌కు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుంది.

హైదరాబాద్ కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అందులోనూ వస్త్రాలపరంగా కూడా హైదరాబాద్ కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఈ నగరం గొప్ప సాంస్కృతిక వస్త్రాలతో నిండిన నగరం. ఈ నగరం శక్తివంతమైన సాంస్కృతిక వారసత్వం, సమకాలీన ఫ్యాషన్‌ రెండించి మిళితంగా ఉంటుంది. అందుకే భారతదేశంలోని ప్రముఖ డిజైనర్‌ ల క్రియేటివ్ విజన్ ను దర్శించడానికి ఇది సరైన వేదికగా మారుతుంది. అత్యంత కష్టమైన హస్తకళకు, వస్త్రాల వినూత్న వినియోగానికి ప్రసిద్ధి చెందిన రాహుల్ మిశ్రా తన స్పెషల్ కలెక్షన్ ను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.

ఆయనతో పాటు ప్రఖ్యాత అబ్రహం అండ్ ఠాకోర్ లేబుల్ వెనుక ఉన్న క్రియేటివ్ విజనరీస్ అయినటువంటి డేవిడ్ అబ్రహం అండ్ రాకేష్ ఠాకోర్ కూడా తమ స్పెషల్ కలెక్షన్ ను హైదరాబాద్ వాసుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. డేవిడ్ అబ్రహాం అండ్ రాకేష్ ఠాకోర్ ని ముద్దుగా మాస్టర్స్ ఆఫ్ మినిమలిజం అని పిలుస్తారు. వారు తమ క్రాఫ్ట్-ఆధారిత, సమకాలీన డిజైన్‌లను వినియోగదారులకు అందిస్తారు. మరోవైపు ఐకానిక్ చీరలు, సమకాలీన ఫ్యూజన్ దుస్తులకు ప్రసిద్ధి చెందారు సత్య పాల్. సత్య పాల్ చీరలు స్టోర్ లైనప్‌కు గ్లామర్, గ్రేస్‌ను జోడిస్తాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement