Tuesday, November 26, 2024

హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు మరో అవార్డు

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. స్కైట్రాక్స్ ప్రపంచ ఎయిర్ పోర్ట్స్ అవార్డులు-2021లో ‘బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్ట్ ఇన్ ఇండియా & సెంట్రల్ ఏషియా’ అవార్డును గెల్చుకుంది. హైదరాబాద్ విమానాశ్రయం స్కైట్రాక్స్ అవార్డును గెల్చుకోవడం వరుసగా ఇది మూడోసారి. అలాగే ప్రపంచ టాప్ 100 విమానాశ్రయాలలో గత ఏడాది 71వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 64వ స్థానానికి చేరింది.

స్కైట్రాక్స్ కొన్ని నెలల క్రితం చాలా విస్తృతంగా ఆన్‌లైన్ ద్వారా చేపట్టిన ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సాటిస్‌ఫాక్షన్ సర్వేను సమీక్షించిన తర్వాత ఈ ఫలితాలను విడుదల చేశారు. ప్రపంచ ఎయిర్‌పోర్టులలో నాణ్యతకు స్కైట్రాక్స్ అవార్డులను గీటురాయిగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 550కి పైగా విమానాశ్రయాలలో కస్టమర్ సేవలను, సౌకర్యాలను పరిశీలించిన అనంతరం వీటిని విడుదల చేస్తారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement