Thursday, September 19, 2024

HYD | ఆ రూట్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు…

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ మేర‌కు నగరవాసులకు పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి 15 రోజుల పాటు.. (ఈనెల 30 వరకు) పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ వెల్లడించారు.

సైబర్ టవర్ ఫ్లైఓవర్ ల్యాండింగ్ ఎండ్ నుంచి జేఎన్‌టీయూ రూట్‌లో యశోదా ఆసుపత్రి వరకు సర్వీస్ రోడ్డును నిర్మించనున్నారు. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అటుగా వెళ్లే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు పోలీసులు తెలిపారు.

సైబర్ టవర్స్, 100 ఫీట్ రోడ్డు, కొత్తగూడ జంక్షన్వైపు నుంచి JNTU, మూసాపేట వైపు వెళ్లే వాహనాలు మళ్లించనున్నట్లు చెప్పారు. ఆయా రూట్లలో వచ్చేవారు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచించారు. JNTU, మూసాపేట వైపు వెళ్లే వాహనదారులు 100 ఫీట్ రోడ్డు మీదుగా పర్వత్‌ నగర్ జంక్షన్, కైత్లాపూర్ వంతెన మీదుగా తమ ప్రయాణాలు సాగించొచ్చు.

ఐకియా, సైబర్ గేట్‌వే, సీవోడీ జంక్షన్ నుంచి సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ మీదుగా JNTU వైపు కూడా ప్రయాణాలు సాగించొచ్చు. సైబర్ టవర్స్‌ ఫ్లై ఓవర్ కింద నుంచి JNTU వైపు వెళ్లే వెహికల్స్ ఎన్ గ్రాండ్ హోటల్, ఎన్ కన్వెన్షన్, జైన్ ఎంక్లేవ్, యశోదా ఆసుపత్రి వెనుక వైపు రోడ్డు, ఆర్వోబీ ఫ్లై ఓవర్ మీదుగా జేఎన్‌టీయూ వైపు వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచకొని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement