మృతదేహాలతో నిండుతున్న మార్చురీలు
గాంధీకి పోటెత్తుతున్న రోగులు
శ్మశానవాటికల్లోనూ రద్దీ
అంత్యక్రియల కోసం వెయిటింగ్
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత శ్రీ టెస్ట్‌లకు దొరకని కిట్స్
తిప్పిపంపుతున్న సిబ్బంది
హడలెత్తిస్తున్న కరోనా సెకండ్‌వేవ్
హైదరాబాద్, రాష్ట్రంలో కరోనా మర ణమృదంగం మోగిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో పెరుగుతూ పోతుండగా, మృతుల సంఖ్య కూడా ఊహించని రేంజ్‌లో పెరుగు తోంది. యువకులు సైతం కరోనాధాటికి విలవిల్లా డుతూ.. పిట్టల్లా రాలుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా మర ణాలు కలవరాన్ని కలిగిస్తు న్నాయి. గత మూడురోజుల వ్యవధిలో.. ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 220మందికి పైగా మృతిచెందినట్లు ప్రచారం జరుగు తోంది. అధికా రికంగా గాంధీ ఆసుపత్రి వర్గాలు దీనిని దృవీకరిం చలేదు. గాంధీ ఆస్పత్రి మార్చురీ మృత దేహాలతో నిండిపోయింది. జనరల్ మార్చురీ బిల్డింగ్‌ను కూడా కరోనా మార్చు రీగా మార్చారు. గాంధీ ఆసుపత్రిలో నాన్ కోవిడ్ మృతదేహాల పోస్టుమార్ట మ్‌లు నిలిచిపో యినట్లు తెలిసింది. పోస్టుమార్టం కోసం ఉస్మానియాకి గాంధీ సిబ్బంది రిఫర్ చేస్తు న్నారు. ఆఖరిక్షణాల్లో తమవద్దకు వస్తుండడంతో ఏం చేయలేకపోతున్నా మని గాంధీ వైద్యులు పేర్కొంటుం డగా, కరోనా భయంతో.. ముందుగా గాంధీ ఆస్పత్రికి పరుగులుతీసి అంబు లెన్స్‌ల్లో కూడా మృత్యువాత పడుతున్న సంఘ టనలు ప్రతిరోజూ జరుగుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారు, యువకులు కూడా కరోనా వచ్చాక ఒత్తిడికి లోనై అనూహ్యంగా మృతిచెందుతుండడం వైద్యులను షాక్‌కు గురిచేస్తోంది. మృతదేహాలతో స్మశానవాటికలు కూడా కిటకిటలాడు తుండగా, ఆస్పత్రులకే కాదు.. స్మశానవాటికల్లోనూ తక్షణదహనాలు జరగని హృదయ విదారక పరిస్థి తులు నెలకొన్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా జిల్లా ల్లోనూ మృత్యువాతపడుతున్న కరోనా రోగుల సంఖ్య పెద్దసంఖ్యలోనే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ తర్వాత వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో కరోనా విజృం భణ తీవ్రంగా ఉంది. కరోనా ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో మరణాలసంఖ్య అధికంగా ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యశాఖవర్గాలు చెబుతున్నాయి.
విషాదం.. విలాపం
గత ఏడాది కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకురాలేదు. ఇపుడు లక్షణా లపై అవగాహన ఉండడంతో.. టెస్ట్‌ల కోసం ఆస్ప త్రుల్లో క్యూలు కడుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా యాం టిజన్ కిట్స్ కొరత నెలకొంది. తెలంగాణలో ఓవైపు యాంటిజన్ కిట్స్, మరోవైపు వ్యాక్సిన్ కొరత.. మందు ల కొరత ప్రజలను వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యాంటిజన్ కిట్స్ లేకపోవడంతో కరోనా భయంతో ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు వెళ్ళిన అనుమాని తులను వైద్య సిబ్బంది వెనక్కి పంపిస్తు న్నారు. కిట్స్ తెప్పించుకోవడంలో ప్రభుత్వం విఫ లమైందని మండి పడుతున్నారు. మరోవైపు ఆర్టీపీసీ ఆర్ టెస్టుల సంఖ్యను కూడా ప్రభుత్వం పెంచడం లేదు. ఆర్టీపీసీ ఆర్ టెస్టుల ఫలితాలు వారం రోజుల పాటు రావడం లేదని రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ల పరిస్థితి కూడా ఇదే. వ్యాక్సిన్ వచ్చిన కొత్తలో అర్హత కలిగిన వారు.. వ్యాక్సిన్ వేసు కునే విషయంలో నిర్ల క్ష్యం ప్రదర్శిం చగా, సెకండ్ వేవ్ జూలు విదల్చడంతో వ్యాక్సినేషన్ కోసం పరుగులు తీస్తున్నారు. ఫలితంగా అనేక కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొరత ఏర్పడింది. కోరుట్లలో టెస్టింగ్ కిట్ల తీవ్రత ఉందని, అక్కడి ప్రజలు ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకు రాగా.. ఆమె పరిస్థితిని మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే స్పందించిన మంత్రి టెస్టింగ్ కిట్లు పంపారు.
ఆక్సిజన్ కొరత
రాష్ట్రంలోని ఆస్పత్రులకు ఆక్సిజన్ కొరత కలవరపె డుతోంది. హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ఎప్పటికపుడు వీటిని సమీక్షిస్తుండగా, కేంద్రమే దీనిని సరఫరాచేయాల్సిఉందని ప్రభుత్వవర్గాలు చెబుతు న్నాయి. సమాయానికి ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్న రోగులసంఖ్య అంతకంతకూ పెరుగు తోంది. వరంగల్ జిల్లాలో కరోనా విజృంభిస్తుం డడంతో ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూకట్టారు. దీంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్ లేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగులు పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఆక్సిజన్ కొరతతో ఆసుపత్రుల్లో ఇదే అదునుగా తీసుకుని ఫీజుల మోత మోగిస్తున్నారు. ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ ఆక్సిజన్ కొరత లేదని చెప్పిన రోజు నుంచే ఆక్సిజన్ కొరత ఏర్పడిందని స్థానికులు, రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులపై కాటు
కరోనా పోలీసుయంత్రాంగపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసులు కరోనాధాటికి విలవిల్లాడుతూ నేలకొరుగు తున్నారు. హైదరాబాద్‌లో వందలసంఖ్యలో పోలీసు లు కరోనాబారిన పడ్డారు.
గడిచిన 24 గంటల వ్యవధి లో నిజామాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 110 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి ంది. దీంతో అక్కడి సిబ్బంది ఆందోళన చెందుతోంది. హైదరాబాద్‌లో ఈ సంఖ్య భారీగా ఉంది.