హైదరాబాద్ : హెచ్‌ఆర్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ 2024 ను ఐఎంటి హైదరాబాద్‌లో నిర్వహించారు. ఐఎంటి హైదరాబాద్‌కు చెందిన, హ్యూమన్ రిసోర్స్ క్లబ్ సినర్జీ, కాన్‌క్లేవ్‌ను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించింది.ఈ సంవత్సరం సదస్సును ఎంపవరింగ్ ఫ్యూచర్ వర్క్‌ఫోర్స్, స్ట్రాటజీస్ ఫర్ ఇన్‌క్లూజివ్ లీడర్‌షిప్ నేపథ్యంతో నిర్వహించారు. ఉమారావు గండూరి, ప్రొఫెసర్ డా.వెంకట చక్రపాణి, ప్రొఫెసర్ డా.తుంప డే, ప్రొఫెసర్ డా.రోమీనా మాథ్యూ, మాళవిక జోషి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రొఫెసర్ డా.వెంకట చక్రపాణి (డీన్ అకడమిక్స్)హెచ్‌ఆర్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ 2024లో మాట్లాడుతూ… హెచ్‌ఆర్ భవిష్యత్తు తీర్చిదిద్దటంలో నాయకత్వం పాత్రను నొక్కిచెప్పారు.
ప్రొఫెసర్ డా.తుంప డే, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్‌ఆర్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ చైర్ మాట్లాడుతూ… భవిష్యత్ సిబ్బందికి సాధికారత కల్పించటం గురించి చర్చించారు. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ లో సీహెచ్‌ఆర్‌ఓఉమారావు గండూరి మాట్లాడుతూ… సమకాలీన ఉద్యోగ రంగాన్ని నడిపించే పరివర్తన అంశాలను గురించి గండూరి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఎంటి హైదరాబాద్‌లోని ఏరియా చైర్‌పర్సన్ హెచ్ ఆర్ ప్రొఫెసర్.డా.రోమినా మాథ్యూ, ఫైర్‌సైడ్ చాట్‌ను నిర్వహించారు. లాయిడ్ బ్యాంకింగ్ గ్రూప్‌లో హెచ్‌ఆర్ హెడ్ డాక్టర్ విపుల్‌సింగ్ మాట్లాడుతూ… ఆర్థిక వృద్ధిని నడిపించడంలో సమ్మిళిత పాత్రను వెల్లడించారు. వైవిధ్యం, అధిక పనితీరు మధ్య అంతర్గత సహసంబంధాన్ని, కార్పొరేట్ సంస్కృతిని రూపొందించడంలో మానవ వనరుల కీలకమైన ప్రభావాన్ని నొక్కి చెప్పారు. పూజా ఖేమ్కా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ అండ్ కార్పోరేట్ ఆపరేషన్స్, ఫోర్త్ పార్టనర్ ఎనర్జీలో హెచ్‌ఆర్ హెడ్ అంజలి భోలే దేశాయ్, ఎఫ్5 నెట్‌వర్క్స్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హ్యూమన్ రిసోర్సెస్ వీపీ, మాల్వీకా జోషి, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌లో సీనియర్ డైరెక్టర్ అండ్ సైట్ హెడ్ సందీప్ బెనర్జీ, అమర్ రాజా గ్రూప్ టాలెంట్ అక్విజిషన్ హెడ్ దిలీప్ కుమార్ ఖండేల్వాల్, తదితరులు ఈకార్యక్రమం లో పాల్గొన్నారు.