Tuesday, November 26, 2024

ముంబైలో ఇళ్లు కాస్ట్‌లీ గురూ.. రెండో స్థానంలో హైదరాబాద్‌..

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లోన్ తీసుకుని ఇల్లు కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక వేళ కొన్నా.. కొన్న వారి నెలవారీ ఆదాయంలో సగటున 56శాతం ఈఎంఐలకే పోతోంది. అఫర్డబులిటీ ఇండెక్స్‌ పేరుతో నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా విడుదల చేసిన ఒక నివేదిక ఈ విషయం పేర్కొంది. గత ఆరునెలల్లో హైదరాబాద్‌, ముంబై, ఢిల్లి, చెన్నై, బెంగళూరుతో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు, ఈఎంఐలను పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు.

ముంబై తర్వాత హైదరాబాద్‌లో ఇళ్ల ధర ఎక్కువగా ఉంది. ఇక్కడ వ్యక్తుల ఆదాయంలో సగటున 31శాతం ఈఎంఐల చెల్లింపులకే పోతున్న‌ట్టు ఆ నివేదికలో పేర్కోంది. అహ్మదాబాద్‌ రియల్టి మాత్రం ఇప్పటికీ అత్యంత చౌకగా ఉంది. అక్కడ ఒక వ్యక్తి నెలవారీ ఆదాయంలో సగటున 22శాతం మాత్రమే గత ఆరు నెలల్లో గృహ రుణ ఈఎంఐల చెల్లింపునకు ఖర్చు చేస్తున్నారు. గత మూడేళ్ల నుంచి అహ్మదాబాద్‌ ఈ విషయంలో ముందుంది. అక్కడ ఇళ్ల ధరల కంటే ప్రజల ఆదాయాలు ఎక్కువగా పెరగడం ఇందుకు కారణ మని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement