Monday, November 25, 2024

హుడా పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

లంగర్ హౌస్ హుడా పార్క్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి వెల్లడించారు. లంగర్ హౌస్ హుడా పార్కును కార్వన్ శాసన సభ్యులు కౌసర్ మోహియుద్దిన్ తో కలిసి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎప్పటికప్పుడు శానిటేషన్ చర్యలు వెంటనే చేపట్టాలని, చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. కార్వాన్ సర్కిల్ వార్డ్ నెంబర్.61 లోని హుడా పార్క్ తో పాటుగా చెర్వును అభివృద్ధి చేయుటకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. లంగర్ హౌస్ ట్యాంక్ నందు గుర్రపుడెక్క పూర్తిస్థాయిలో తొలగించాలని, కెమికల్స్ ద్వారా వాటర్ ట్రీట్మెంట్ చేపట్టేందుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ఇంజనీరింగ్ ఈ.ఈ లేక్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దోమల నిర్మూలనకు కూడా ఎంట‌మాల‌జీ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. లంగర్ హౌస్ ట్యాంక్ ను హుడా పార్క్ లో దత్తత తీసుకొని 40 ఎకరాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తామని
తెలిపారు. అర్బన్ బయోడైవర్సిటీ ద్వారా సుందరీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక శాసనసభ్యులు కౌసర్ మొహియుద్దీన్ మాట్లాడుతూ… హుడా పార్క్, లంగర్ హౌస్ చెరువు నందు గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకి నాలా నీరు చేరకుండా మూసీలో కలిసే విధంగా చర్యలు తీసుకోవాలని, పూడికతీత పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మేయర్ వెంట ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, శానిటేషన్ డీఈ (ఎస్ డ‌బ్ల్యూఎం) బేరి వెంకటరాజు, సీఈ లేక్స్ సురేష్ కుమార్, ఈఈ గోవర్ధన్, యూబీడీ శ్రీనివాస్, డీసీ నరసింహ, ఇరిగేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement