హైదరాబాద్ : వాట్సాప్‌ను దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్నేహితులు, కుటుబ సభ్యులు ఎక్కడ ఉన్నా వారితో టచ్‌లో ఉండటానికి ఉపయోగిస్తున్నారు. ఇది 11 భాషల్లో అందుబాటులో ఉంది. మీకు ఇష్టమైన క్షణాలను చిత్రాలు, వీడియోల ద్వారా మీ ప్రియమైన వారితో పంచుకోవడానికి సులభమైన, ప్రైవేట్ మార్గం వాట్సాప్. మీరు ఎవరికైనా ముఖ్యమైన విషయం చెప్పడానికి లేదా స్నేహితుడితో చాట్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. మీరు ఒకరినొకరు చూసుకోవడానికి వీడియో కాల్‌లు కూడా చేయవచ్చు. లేదా మీరు టైప్ చెయ్యకూడదనుకుంటే వాయిస్ సందేశాలను పంపుకోవచ్చు.
అన్ని మెసేజ్‌లు, కాల్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సురక్షితం చేయబడ్డాయి. అంటే మీరు, మాట్లాడుతున్న వ్యక్తి మాత్రమే వాటిని చూడగలరు. మరెవ్వరూ మీ వాట్సాప్ చూడలేరు. వాట్సాప్ లో మీ రోజువారీ సంభాషణలను మరింత ఆసక్తికరంగా మార్చే అగ్రఫీచర్లు ఇవే… నిజసమయ అప్‌డేట్‌ల కోసం వీడియో సందేశం, మీ స్క్రీన్ ను భాగస్వామ్యం చేయాలి. ఎవరైనా చూడకముందే అక్షర దోషాలను సవరించాలి. ముఖ్యమైన మెసేజ్‌లు, డాక్యుమెంట్‌లకు స్టార్ చేయాలి. చాట్‌ను పిన్ చేయాలి. మీకు మీరే సందేశం పంపాలి. మీ సందేశాన్ని తొలగించాలి. వాయిస్ నోట్స్, గ్రూప్ వివరణను సవరించాలి. అవతార్‌లు, ఎమోజి ఫీచర్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేయాలని ఆ సంస్థ పేర్కొంది.