హైదరాబాద్: కోర్టు ధిక్కారణ కేసులో తెలంగాణ హైకోర్టు నల్గొండ జిల్లా కలెక్టర్ కు వినూత్న శిక్ష విధించింది..గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంతో ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ , అప్పటి పౌరసరఫరాల శాఖ అధికారిణి సంద్యారాణిలకు రెండు వేల రూపాయిలు జరిమానా కట్టాలని తీర్పు ఇచ్చారు..అయితే వారిద్దరూ ఈ తీర్పును రద్దు చేయాలని డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు.. ఈ కేసును విచారించిన డివిజన్ బెంచ్ అనాథాశ్రమంలో వారానికి 2 గంటలు గడపాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఆరు నెలలపాటు అనాథాశ్రమానికి వెళ్లి సేవ చేయాలని కలెక్టర్‌కు ఆదేశించింది. అలాగే విశ్రాంత పౌరసరఫరాల జిల్లా అధికారి సంధ్యారాణి ఉగాది, శ్రీరామనవమి రోజుల్లో అనాథాశ్రమంలో భోజనాలు పెట్టాలని ఆదేశించింది. కోర్టు ధిక్కారణ నిరూపణ కావడంతో ఈ ఇద్దరు సామాజిక సేవ చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు విచారణను ముగించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement