Sunday, November 24, 2024

టి ఎస్ పి ఎస్ సి ఛైర్మన్, సభ్యులను నాలుగు వారాలలోగా నియమించండి – హైకోర్టు ఆదేశం..

హైద‌రాబాద్ – తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్, స‌భ్యుల‌ను నాలుగు వారాల‌లోగా నియ‌మించాల‌ని హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.. టిె ఎస్ పి ఎస్ సి బోర్డులో ఛైర్మ‌న్ తో స‌హా స‌భ్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్ర‌భుత్వ ఉద్యోగాల నియ‌మాకాలు జ‌ర‌గ‌డం లేదంటూ వేసిన పిల్ పై హైకోర్టులో నేడు విచార‌ణ జ‌రిగింది.. ప్రస్తుతం టి ఎస్ పి ఎస్ సి ఇన్ ఛార్జీ ఛైర్మ‌న్ తో మాత్ర‌మే న‌డుస్తున్న‌ద‌ని కోర్టు దృష్టికి తెచ్చారు పిటిష‌న‌ర్.. ఛైర్మ‌న్, ఇత‌ర స‌భ్యులు ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో గ‌త సంవ‌త్స‌ర కాలంగా టిపిఎస్ సిలో కార్య‌క‌లాపాలు కుంటు ప‌డ్డాయ‌ని హైకోర్టులో వాద‌న‌లు వినిపించారు.. ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు నోటిఫికేష‌న్ ల కోసం ఎదురు చూస్తున్నార‌ని, నోటిఫికేష‌న్ లు విడుద‌ల కాక‌పోవ‌డంతో కొంద‌రు నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని కూడా కోర్టులో ప్ర‌స్తావించారు.. దీంతో నాలుగు వారాల‌లో ఛైర్మ‌న్ తో స‌హా ఇత‌ర స‌భ్యుల‌ను క‌మిష‌న్ లో నియ‌మించాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement