Friday, November 22, 2024

తెలంగాణ‌కు ఆక్సిజ‌న్ రాకుండా అడ్డుకుంటున్న త‌మిళ‌నాడు…

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం అవ‌స‌రమైన ఆక్సిజెన్ ను కేంద్రం వివిధ రాష్ట్రాల నుంచి తీసుకోవాల‌సిందిగా కోరింది..ఇందుకు నిర్ధిష్ట‌మైన విధివిధానాలు కూడా ప్ర‌క‌టించింది… అయితే త‌మిళ‌నాడు నుంచి తెలంగాణ‌కు రావాల‌సిన ఆక్సిజన్ కోటాను త‌మిళ‌నాడు అడ్డుకుంటున్న‌ది… ఇదే విష‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది… రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం జ‌రిగి విచారణకు డీజీపీ మహేందర్‌ రెడ్డి, రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు హారజయ్యారు. ఈ సందర్భంగా ఆక్సిజన్‌ రాకుండా తమిళనాడు అడ్డుకుంటోందని డీహెచ్‌ హైకోర్టుకు తెలుపగా.. వెంటనే ఇతర రాష్ట్రాల నుంచి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది… ఎటువంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ‌కు వ‌చ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రాన్ని కోరింది.. ఇదే సంద‌ర్భంగా .హైకోర్టు రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేసింది. మాస్కు ధరించని వారి వాహనాలను జప్తు చేసే అంశాన్ని పరిశీలించాలని పోలీసు శాఖకు సూచించింది. ఔషధాల అక్రమ విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది. ఫంక్షన్‌ హాళ్లు, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. రాత్రి క‌ర్ప్యూని మ‌రికొన్ని గంట‌లు పెంచాల‌ని, ఈ నెల 8వ తేదిలోగా దీనిపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరింది. ‘‘వారాంతపు లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపు ప్రతిపాదనను పరిశీలించాలి. ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స, ఔషధాల గరిష్ఠ ధరలు ప్రభుత్వం నిర్ణయించాలి. ప్రైవేట్‌ దవాఖానల్లో కొవిడ్‌ చికిత్సపై తాజా మార్గదర్శకాలు విడుదల చేయాలి. కరోనా పరీక్షలు తగ్గించొద్దు.. రోజుకు లక్షకుపైగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. సంచార వ్యానుల ద్వారా ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలి. ఖైదీలు నిరాశ్రయులకు టీకాలు ఎలా వేస్తారో స్పష్టం చేయాలి. రెండు రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. నిపుణల కమిటీ సమావేశాల వివరాలు సమర్పించాలి. శ్మశాన వాటికల్లో సదుపాయాల వివరాలు తెలపాలి. శుభకార్యాల్లో 200 మంది, అంత్యక్రియల్లో 50 మందికి మించొద్దు. వివాహాలు, అంత్యక్రియల ఆంక్షలపై వెంటనే జీవో ఇవ్వాలి’’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జీహెచ్‌ఎంసీలో టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలుపగా వారంలోగా అన్ని జిల్లాల్లో టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement