హైదరాబాద్ : బియా బ్రాండ్స్ వెనుక ఉన్న వ్యాపార దిగ్గజం సుధాకర్ అడప, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన హలో భాగస్వామ్యంతో మీడియా రంగంలోకి అడుగు పెట్టారు. ఈ ప్రవేశంతో అడప విలాసవంతమైన జీవనశైలి మ్యాగజైన్ లు హలో! ఇండో-అరేబియా, హలో అరేబియా! ను పోర్ట్ఫోలియోకి జోడించారు. పబ్లిషింగ్ రంగంలోకి ప్రవేశించిన మొదటి భారతీయుడిగా ఒక ముఖ్యమైన మైలురాయిని అడప చేరుకున్నారు.
ఈసందర్భంగా బియా బ్రాండ్స్ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ సుధాకర్ అడప మాట్లాడుతూ… హలో! ఇండో-అరేబియా, హలో! అరేబియా పగ్గాలు చేపట్టడం తనకు గర్వకారణంగా వుందన్నారు. ఈ తరహా హక్కులను పొందిన తొలి భారతీయుడను తానే అనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత ప్రత్యేకమన్నారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న వ్యాపార దృశ్యంలో, బలమైన, ప్రపంచ బ్రాండ్లను నిర్మించడం తమకు అత్యవసరమన్నారు. హలో గ్రూప్ ఛైర్మన్, ఎడ్వర్డో సాంచెజ్ పెరెజ్ మాట్లాడుతూ… హలో ఇండో-అరేబియా, హలో అరేబియా లు పెద్ద హలో, హలో కుటుంబంలో చేరినందుకు తాము సంతోషిస్తున్నామన్నారు.