Saturday, November 23, 2024

హైదరాబాద్‌లో మరో 12 గంటలపాటు భారీ ఈదురుగాలు, వర్షాలు.. హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ శాఖ‌

రానున్న 12 గంటల్లో వర్షాలు విపరీతంగా కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ రోజు (మంగళవారం) ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారులకు సూచించింది. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కూడా అప్రమత్తమైంది. రానున్న 12 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ఐఎండీ తెలిపింది.

భారీ వర్షాల కారణంగా చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందున జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రోడ్లు లేదా వీధుల్లో అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలని కోరారు. ఎక్కడైనా నేలకొరిగిన చెట్లు కనిపిస్తే వాటిని తోలగించడినికి జీహెచ్‌ఎంసీ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని చెత్తను తొలగిస్తారు. దీని కోసం GHMC 040-1111111 టోల్ ఫ్రీ నంబ‌ర్ ను జారీ చేసింది.

ఇక ఉత్తరాది జిల్లాలైన నిర్మల్‌, ఆసిఫాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అత్యధికంగా కుమురం భీమ్ ఆసిఫాబాద్‌లోని కెరమానిలో 18.8 సెం.మీ, జైనారంలో 15.9, ఆసిఫాబాద్‌లో 11.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు శ్రీరాం సాగర్‌ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు ఇన్‌ ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 90,580 క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లోలు, 69,450 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టులో ఎఫ్‌ఆర్‌ఎల్‌ 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1087 అడుగుల నీటిమట్టం ఉంది. రాష్ట్ర సగటు వర్షపాతం 24.9 మి.మీ సాధారణ వర్షపాతం 9.3 మి.మీ. జూన్ 1 నుండి జూలై 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం సాధారణ వర్షపాతం 213.2 మి.మీకి 420.6 మి.మీ, 97 శాతం విచలనం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement