Wednesday, November 13, 2024

Heavy Rains – ఉత్త‌రాఖండ్ లో విరిగిన కొండ చ‌రియ‌లు – ఇద్ద‌రు హైద‌రాబాదీయులు మ‌ర‌ణం


బ‌ద్రీనాద్ ద‌ర్శించుకుని వ‌స్తుండ‌గా ప్ర‌మాదం
వారు ప్ర‌యాణిస్తున్న బైక్ పై ప‌డిన కొండ రాళ్లు
స్పాట్ లోనే దుర్మ‌ర‌ణం

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడిపోతున్నాయి. చమోలీ జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు మరణించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. కర్ణప్రయాగ, గౌచర్‌ మధ్యలోని బద్రీనాథ్‌ నేషనల్ హైవేపై ఈరోజు ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన నిర్మల్‌ షాహీ, సత్య నారాయణ లు బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా.. మార్గమధ్యంలో కొండచరియలు విరిగిపోయి వారిపై పడడటంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. మృతుల స‌మాచారాన్ని వారి బంధువులు అందించిన‌ట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement